/rtv/media/media_files/2025/03/06/2Lq26PdZ2wN1sAKH06qj.jpg)
Ap traffic
Traffic police: ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు.
డబ్బులు ఊరికే రావు..
ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు కొత్తగా 1వ తేది నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ అధినేత ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్ అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని డీఎస్పీ ప్రసాద్ కోరుతున్నారు. ప్రతి ఒక్కరికీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, రూల్స్ అతిక్రమిస్తే ఫైన్స్ విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుందని తెలిపారు.
కేంద్ర మోటార్ వెహికల్ చట్టం..
మార్చి ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీలోని ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలను పెంచినట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5000, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 4000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రూ. 1500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి రూ. 1000, అలాగే బైక్ వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో రూ. 1000 , అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 1500, రెండవసారి రూ. 10000, ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించ కుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 150, రెండవసారి రూ. 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు రూ. 750, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో రూ. 1000, కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించని పక్షంలో మరో రూ. 1000, వాహన రిజిస్ట్రేషన్ లేనిపక్షంలో రూ. 2000, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 5000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి రూ. 5000, రెండవసారి రూ. 10000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే రూ. 1000, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నారు.
Also Read: ఇడ్లీ-సాంబార్ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!