/rtv/media/media_files/2025/01/27/dxY1mDlhYXOYWpZweeb0.jpg)
AP House for All Scheme
AP House for All Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్ల 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన అర్హతలను కూడా ఉత్తర్వుల్లో తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ(TDP) కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇస్తామని ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ(Revenue Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఇక ఈ జీవో ప్రకారం చూసుకుంటే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇంటి పట్టా వచ్చిన రెండేళ్లలోనే అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?
అర్హతలు ఇవే..
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇవ్వనుంది. ఇంటిస్థలం పట్టా వచ్చినవాళ్లకి పదేళ్ల తర్వాతనే ఆ స్థలంపై వారికి పూర్తిగా హక్కులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్ డీడ్‌ను జారీ చేయనున్నారు.
అయితే ఈ స్కీమ్ కింద లబ్ధిపొందబోయే వారికి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటిస్థలం ఉండకూడదు. అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదని కూటమి సర్కార్ షరతులు పెట్టింది. అంతేకాదు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో కూడా లబ్ధిదారుగా ఉండకూడదని క్లారిటీ ఇచ్చింది. అలాగే రేషన్ కార్డు ఉండాలి. 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లోపు మగాణి ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనుంది.
Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే
ఆ తర్వాత గ్రామ, వార్డు సభల్లో అభ్యంతరాలు స్వీకరించి అర్హులను నిర్ణయిస్తారు. ఇదిలాఉండగా.. ఇంటి పట్టాల పంపిణీ కోసం ఉన్న భూమినే వినియోగించాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే కొత్త భూములు కొనకుండానే ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూముల్లోనే అర్హులకు పట్టాలకు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?
Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే