/rtv/media/media_files/2025/03/04/OwKuR7XSOn1i6YWG6hYY.jpg)
YCP Leader Vidadala Rajani
వైసీపీ నేత విడదల రజనీ (Vidadala Rajani), ఐపీఎస్ అధికారి పల్లో జాషువాల విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది ప్రభుత్వం. దీనికి ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కనుక వస్తే వెంటనే వారిద్దరిపై కేసు నమోదు చేస్తారు.
Also Read : రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?
రూ.5 కోట్లు డిమాండ్ చేశారు..
శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ ఓనర్ లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు రూ.5కోట్లు డిమాండు చేసి.. రూ.2.20 కోట్లు వసూలు చేశారని.. అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ (ACB) విచారణకు ఆదేశించింది.
Also Read : ఇంగ్లీష్ వద్దమ్మా.. తెలుగులోనే మాట్లాడండి.. రఘురామ సలహా!
మరోవైపు కొన్ని రోజుల క్రితమే వైసీపీ (YCP) నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచరించిన హైకోర్టు.. విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నానంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాననే కారణంతో 2019లో పిల్లి కోటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చిలకలూరిపేట పట్టణ సీఐ తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Bolivia: బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ.. జగన్, పవన్ లపై హర్షకుమార్ సంచలన కామెంట్స్!
ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు.
jagan-and-harsha-kumar
ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!
ముమ్మాటికీ హత్యే
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యేనని.. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని హర్షకుమార్ వెల్లడించారు. ఇందుకోసం 2025 శనివారం 19వ తేదీన గుడ్ ఫ్రైడే రోజున సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వూరు దివాన్ చెరువు రోడ్ లో నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరికి వారు ఒక కొవ్వొత్తు తెచ్చుకొని అక్కడ వెలిగించి వెళ్ళండని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రవీణ్ ను ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మే ప్రతి ఒక్కరు రావలన్నారు హర్షకుమార్. అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్రా, తెలంగాణలో ఉన్న ప్రతి సమాదుల దొడ్డి దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. మన నిరసనను కూడా చాలా శాంతి పంథంలో తెలుపుదామని.. తనకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని హర్షకుమార్ వీడియోలో కోరారు.
Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!
Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
Diabetes: డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగవచ్చా?
🔴IPL 2025 DC vs RR Live Score: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!
Porel: అదెం కొట్టుడు రా సామీ.. పొరెల్ పరుగుల వరద- ఒకే ఓవర్లో 4, 4, 6, 4, 4
Retro Trailer Update: సూర్య 'రెట్రో' ట్రైలర్ వచ్చేస్తోంది..
Krrish 4: హృతిక్ రోషన్ కు ప్రియాంక చోప్రా భారీ షాక్..!