National Film Awards: అదరగొట్టిన ఉప్పెన.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు

ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటిస్తున్నారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటిస్తుండగా.. దాదాపు 30 సినిమాల నుంచి ఎంట్రీలు వెళ్లాయి. వీటిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన కమిటీ అవార్డులను ప్రకటిస్తోంది. తెలుగు , తమిళం, మరాఠీ , హిందీ , మలయాళం , కన్నడ , బెంగాలీ భాషా చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటిస్తుండగా.. తెలుగు నుంచి జాతిరత్నాలు , లవ్ స్టొరీ , పుష్ప , RRR , ఉప్పెన , మెయిల్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.

author-image
By Amar
New Update
National Film Awards: అదరగొట్టిన ఉప్పెన.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు

ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటిస్తున్నారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటిస్తుండగా.. దాదాపు 30 సినిమాల నుంచి ఎంట్రీలు వెళ్లాయి. వీటిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన కమిటీ అవార్డులను ప్రకటిస్తోంది. తెలుగు , తమిళం, మరాఠీ , హిందీ , మలయాళం , కన్నడ , బెంగాలీ భాషా చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటిస్తుండగా.. తెలుగు నుంచి జాతిరత్నాలు , లవ్ స్టొరీ , పుష్ప , RRR , ఉప్పెన , మెయిల్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటిస్తున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో నిలిచారు. పుష్ఫ సినిమాకు అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నారు. మలయాళంలో జోజు జార్జి, తమిళంలో సూర్య ఈ రేసులో ఉన్నా తెలుగు హీరోలలో ఎవరో ఒకరిని ఈ అవార్డు వరించే అవకాశం ఉంది.

రేసులో RRR, పుష్ప

2021 సంవత్సరానికి గానూ ఈపురస్కారాలను అందించనున్నారు. RRR మూవీ 2022లో విడుదల అయినప్పటికీ, దానికి సంబంధించిన సెన్సార్ 2021లోనే పూర్తయిపోయింది. కాబట్టి 2021కే అవార్డుల రేసులో RRR నిలిచింది. ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడికి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. మరో పక్క తమిళంలో మాత్రం కమల్ హాసన్ మూడు సార్లు, ధనుష్ రెండు సార్లు ఈ అవార్డు సాధించారు. దివంగత ఎంజీఆర్, చియాన్ విక్రమ్, సూర్య ఒక్కోసారి ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు