Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు. By Manogna alamuru 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YCP Leader Jogi Ramesh : మీరేమైనా చేసుకోండి నాది ఒక్కటే సమాధానం...తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh). రెండోసారి పోలీస విచారణకు హాజరైన రమేశ్ అసలు ఏమాత్రం నోరు విప్పడం లేదని తెలుస్తోంది. డీఎస్సీ ఆఫీసులో ఈయన విచారణ కొనసాగింది. అయితే జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. మేం అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. అదే కాదు దాడి జరిగిన రోజున ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డును...మాకు ఇంత వరకు ఇవ్వలేదని డీఎస్పీ చెప్పారు. దాంతోపాటూ నిందితుడి నుంచి ఫోన్, సిమ్ కార్డు వివరాలు తీసుకోవద్దని పలు కేసులలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయని, వాటి ఉదాహరణలను రమేశ్ తాలూకా న్యాయవాది వెంకటేశ్వరశర్మ చూపించారని అన్నారు. అయితే దీని మీద తాము సంతృప్తి చెందలేదని..మరోసారి జోగి రమేష్‌ను విచారణకు పిలుస్తామని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. మరోవైపు విచారణ తర్వాత జోగి రమేశ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక విచారణకు రమేశ్‌తో పాటూ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ (Fiber Net) మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వరశర్మ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. Also Read: Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు #andhra-pradesh #mangalagiri #jogi-ramesh #investigation #dsp-office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి