Reliance AGM 2023: జియో 5G, జియో ఎయిర్‌ఫైబర్, జియో స్మార్ట్‌ఫోన్.. అంబానీ ఏం చెప్పబోతున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ 'RIL AGM 2023' ఎల్లుండు(ఆగస్టు 28) జరగనుంది. ఈ సారి ఈవెంట్‌లో '5G' చుట్టూనే అంబానీ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 5జీకి సంబంధించి కొత్త ప్లాన్లను, జియో ఎయిర్‌ఫైబర్ గురించి అంబానీ కీలక ప్రకటన చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అటు జీయో 5జీ స్మార్ట్ ఫోన్ గురించి కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. By Trinath 26 Aug 2023 in బిజినెస్ New Update షేర్ చేయండి Reliance AGM 2023: ఈ ఏడాదిలో రిలయన్స్ నుంచి అతిపెద్ద ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ 'RIL AGM 2023' ఈవెంట్ కోసం తేదీలను ప్రకటించింది. ఆగస్ట్ 28న RIL AGM నిర్వహించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఏం ప్రకటించబోతున్నరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జియో 5జీ గురించి కీలక ప్రకటనలు ఉంటాయని సమాచారం. దీంతో పాటు 'JioAir' ఫైబర్ రోడ్‌మ్యాప్, కొత్త '5G జియో' (JIO 5G) స్మార్ట్‌ఫోన్‌తో మరిన్ని వివరాలను ఆయన ప్రకటించే అవకాశముంది. దేశవ్యాప్తంగా విస్తరించేందుకు...! RIL AGM-2023 ఈవెంట్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కొత్త జియో-5G ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రిలయన్స్ జియో ఇప్పటికే చాలా వరకు భారతీయ ప్రాంతాలలో 5G నెట్‌వర్క్‌లను ప్రవేశపెట్టింది. 2024 నాటికి పూర్తి స్థాయి 'జియో5G' సర్వీస్ రోల్‌అవుట్‌కు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా 7,500 కంటే ఎక్కువ ప్రాంతాలు, జిల్లాలు నగరాల్లో 5G కవరేజీని విస్తరించారు. జియో 5G సేవలను అందించడానికి ఇప్పటికే ఉన్న 4G ప్లాన్‌లను ఉపయోగించుకుంది. అయినప్పటికీ, కంపెనీ ఈ ఈవెంట్‌ని 5G టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించడానికి వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లు రాబోయే AGM ఈవెంట్‌లో ప్రారంభమవుతాయా లేదా రానున్న నెలల్లో ప్రవేశపెట్టబడతాయా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్లాన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ధర తక్కువే? 5G టారిఫ్ ప్లాన్‌లను సరసమైన ధరకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఒక జీబీకి దాదాపు రూ.300 నుంచి దాదాపు రూ.10 వరకు డేటా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయిన ప్రధాని మోదీ కూడా చెప్పారు. "సగటున.. దేశంలో ఒక వ్యక్తి నెలకు 14GB వినియోగిస్తున్నాడు. దీని కోసం నెలకు సుమారు రూ. 4200 ఖర్చు అవుతుంది, కానీ కేవలం రూ. 125-150 ఖర్చుతో సరిపోతుంది' అని తెలిపారు. జియో 5G టారిఫ్ ప్లాన్‌లు ప్రపంచంలోని ఏ టెలికాం కంపెనీతో పోల్చినా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ గతేడాది ప్రకటించారు. అటు ఎయిర్‌టెల్‌లోని ఒక సీనియర్ అధికారి 5G ప్లాన్ రేట్లు 4G ప్లాన్‌లకు ప్రతిబింబిస్తాయని చెప్పింది. ప్రస్తుతం వినియోగదారులు అపరిమిత(unlimited) ప్రయోజనాల కోసం రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేస్తున్నారు. 5G డౌన్‌లోడ్ వేగం 4G LTE (338.12 Mbps vs. 13.30 Mbps) కంటే 25 రెట్లు ఎక్కువ. 5G అప్‌లోడ్ వేగం 4.5 రెట్లు ఎక్కువ (4G LTE-19.65 Mbps vs 3.55 Mbps). ఇక 'ఓపెన్ సిగ్నల్' ప్రకారం Jio 5G డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో (315.5Mbps) టాప్ ప్లేస్‌లో ఉంది. Also Read: రీల్స్ చేయాలనుందా? మీ బడ్జెట్లోనే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ..!! #mukesh-ambani #jio #reliance-jio #jio-5g-plans #jio-5g #reliance-agm-2023 #ril-agm-2023 #reliance-46th-agm #reliance-agm-on-aug-28 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి