Wife Cut Husband Private Parts: కోపంతో భర్త మర్మాంగాలను కోసేసిన భార్య

కట్టుకున్న భర్తపై ఓ భార్య కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి భార్యకు సంబంధించిన వీడియోలను చూస్తున్నాడనే కోపంతో ఏకంగా భర్త మర్మాంగాలను కోసేసింది తన రెండో భార్య. దీంతో బాధితుడికి తీవ్ర రక్తస్రావం కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
Wife Cut Husband Private Parts: కోపంతో భర్త మర్మాంగాలను కోసేసిన భార్య

Wife cut Husband Private Parts

తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడనే కారణంతో కర్నూలు జిల్లా (Kurnool District) లో భర్త నాలుకను భార్య (Wife) కోసేసిన ఘటన మరవకముందే తాజాగా అలాంటి దారుణం మరొకటి ఏపీ (AP)లో జరిగింది. మొదటి భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఆమె రీల్స్ చూస్తున్నాడనే కోపం(Angry)తో రెండో భార్య దారుణానికి పాల్పడింది. ఏకంగా.. భర్త మర్మాంగాలను బ్లేడ్‌(Blade)తో కోసేసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ(Nandigama)లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.

ఆనంద్‌బాబు వరమ్మతో రెండో పెళ్లి..

ఎన్టీఆర్ జిల్లా(NTR District) ముప్పాళ్ళ(Muppala) గ్రామానికి చెందిన కోట ఆనంద్‌బాబు(Kota Ananda Babu) గతంలో ఒక మహిళను పెళ్లి(Marraiage) చేసుకున్నాడు. అయితే భార్యతో విబేధాలు రావడంతో మనస్పర్థల కారణంగా ఇద్దరు విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు. అయితే ఐదేళ్ల క్రితం.. వరమ్మ అనే మరో మహిళను ఆనంద్‌బాబు రెండో పెళ్లి(Second Marriage) చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు తన గ్రామమైన ముప్పాళ్లలో రెండో భార్యతో కలిసి ఉండగా.. ఐదు నెలల క్రితం నందిగామలోని అయ్యప్పనగర్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి భార్య రీల్స్‌ను చూస్తున్నాడని..

అయితే గత కొంతకాలంగా.. ఆనంద్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తన మొదటి భార్య రీల్స్‌ను చూస్తున్నాడు. గతరాత్రి మొదటి భార్య వీడియోలు చూస్తుండగా రెండో భార్య(Second Wife) దీనిని గమనించి ఆనంద్ బాబును నిలదీసింది. తనను పెళ్లి చేసుకుని మొదటి భార్య వీడియోలు(Videos) ఎందుకు చూస్తున్నారంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ మరింత పెరగడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన మహిళ.. బ్లేడ్‌తో ఆనంద్ బాబు మర్మాంగాలను కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావం(Bleeding) కాగా.. స్థానికులు బాధితుడిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి(Nandigama Govt Hospital) తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం ఆనంద్ బాబును విజయవాడ(Vijayawada)కు తరలించారు.

ముద్దు పెట్టినందుకు భర్త నాలుకను కోసేసిన భార్య

Wife cut Husband Private Parts

శుక్రవారం రోజున కర్నూలు జిల్లా(Kurnool District) తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండా(Ellam Gutta Thanda) గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ముద్దు పెట్టినందుకు భర్త తారాచంద్ నాయక్(Thara Chand Naik) నాలుకను భార్య పుష్పవతి కోసేసింది. దీనిపై జొన్నగిరి పోలీసులు కేసు(Case File) నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. బాధితుడు ప్రస్తుతం అనంతపురం(Anantapuram)లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. భార్యాభర్తల(Husband & Wife) మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP Govt

ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ ఈ శనివారం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు లేదు. శనివారం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవు రద్దు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఏప్రిల్‌ 12న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ఈ మేరకు ఏప్రిల్‌ 12ను వర్కింగ్‌ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఇటీవల ఉగాది, రంజాన్ రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మార్చి నెల 30  ఆదివారం నాడు, 31 సోమవారం నాడు ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావటంతో ఏపీలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసులకు వర్కింగ్ డేలుగా ప్రకటించారు.

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

తాజాగా రెండో శనివారం రోజైన రేపు కూడా అంటే ఏప్రిల్ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత మెరుగ్గా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. 

కొత్త విధానం ప్రకారం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు పని దినాల్లో ఉదయం 10: 30 నుంచి సాయంత్రం 5:30 మధ్యలో స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ  నిర్దేశిత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించే ఇబ్బందులు ప్రజలకు తప్పుతాయని ప్రభుత్వం అనుకుంటుంది.. ఇక సెలవు దినాల్లోనూ రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రేపు వర్కింగ్ డే కావటంతో ఐదు వేలు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

Also Read: Egg prices: కోడిగుడ్డుకు రెక్కలు.. కోళ్లను అద్దెకు తెచ్చకుంటున్న అమెరికన్స్

Also Read: Nampally POCSO court : మైనర్ బాలికకు వేధింపులు...నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు

ap | govt | ap-govt | andhra-pradesh-govt | holiday | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

 

Advertisment
Advertisment
Advertisment