Bath: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది?..నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి?

ఉదయాన్నే తలస్నానం చేస్తే ప్రయోజనమా? రాత్రిపూట స్నానం చేస్తే బెటరా? నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..? చల్లని నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చా? వేడి నీరు మంచివా? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Bath: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది?..నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి?

Bath: మన భారతదేశం కాకుండా జపాన్, కొరియా, చైనా వంటి అనేక దేశాల్లో సాయంత్రం పూట స్నానం చేసే సంప్రదాయం ఉంది. రోజంతా మనం దుమ్ము, ధూళిలో తిరుగుతాం. శరీరం మరింత మురికిగా లేదా రాత్రిపూట బ్యాక్టీరియాకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్నానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ స్నానం చేయడం వల్ల మనిషి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కానీ స్నానం చేసేందుకు సరైన సమయం కూడా ఉందని అంటున్నారు. నిజానికి మన భారతదేశంలో చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది నిద్రపోయే ముందు స్నానం చేయడం మంచిదని అంటున్నారు.

publive-image

ఉదయాన్నే తలస్నానం చేస్తే?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల రోజును తాజాదనంతో ప్రారంభించవచ్చు. అంటే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తే రోజంతా ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. అంతే కాకుండా ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల సోమరితనం కూడా దూరం అవుతుందని అంటున్నారు.

what time good to take a bath What temperature of the water

రాత్రిపూట స్నానం చేస్తే..?

రాత్రి స్నానం గురించి చెప్పాలంటే అది పరిశుభ్రత పరంగా బాగుంటుందని అంటున్నారు. మన భారతదేశం కాకుండా జపాన్, కొరియా, చైనా వంటి అనేక దేశాల్లో సాయంత్రం పూట స్నానం చేసే సంప్రదాయం ఉంది. రోజంతా మనం దుమ్ము, ధూళిలో తిరిగినప్పుడు శరీరం మురికిగా మారుతుంది. అంతేకాకుండా రాత్రిపూట బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే పగటిపూట కంటే రాత్రి స్నానం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

publive-image

నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..?

స్నానం చేయడానికి నీటి ఉష్ణోగ్రత కూడా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట స్నానం చేస్తే గోరువెచ్చని నీటిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రవేళ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరాన్ని బాగా శుభ్రపరచడమే కాకుండా, వ్యక్తి త్వరగా రిలాక్స్‌డ్ స్థితికి రావడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం స్నానం చేయడానికి బదులుగా చల్లని నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేస్తే సోమరితనం పోతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నిద్రించే ముందు గ్లాసు పాలలో ఇది వేసుకుంటే మలబద్ధకం మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం సీన్ నే మార్చేసింది. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతకు తెర లేపింది.దీంతో రెండు దేశాలూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే..పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ ను రద్దు చేసింది. అసలేంటీ సిమ్లా ఒప్పందం?

New Update
ind

Shimla Agreement

కాశ్మీర్ లో ఉగ్రదాడికి భారత్ రగిలిపోతోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన టెర్రరిస్టులకు, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపే ఐదు కీలక నిర్ణయాలను తీసుకుంది.  పాకిస్తాన్ ను అన్ని విధాలా దిగ్భంధనం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ భారత్ దారిలోనే నడిచింది. వాళ్ళు కూడా దౌత్యపరమైన నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ఒకటి సిమ్లా ఒప్పందం రద్దు. అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏమిటి? దీనిలోని నిబంధనలు ఏమిటి? దీని రద్దు వల్ల భారత్, పాక్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ నిర్ణయంతో ఇరు దేవాల మధ్యా యుద్ధం కచ్చితంగా జరుగుతుందా..

1972లో కుదుర్చుకున్న ఒప్పందం...

1972 జూలై 2న భారత్, పాకిస్థాన్ మధ్య సిమ్లాలో కుదిరిన చారిత్రక ఒప్పందం ఇది. 1971లో ఇండియా-పాక్ మధ్య యుద్ధం జరిగింది. దాని తరువాత రెండు దేశాల మధ్యనా మామూలు వాతావరణం తీసుకువచ్చేలా సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనిపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు.  ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఉన్న అన్ని వివాదాలను, సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. మూడో దేశం లేదా పక్షం ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలనేది భారతదేశం ముఖ్య ఉద్దేశం.  అంతేకాదు యుద్ధం టైమ్ లో భారత్, పాక్ ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి తమ సైనిక బలగాలను వెనక్కు రప్పించడం కూడా ఇందులో ఉంది. అలాగే 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన ఎల్వోసీ సరిహద్దు రేఖను ఇరు దేశాలు గౌరవించాలని, ఎవరూ దీన్ని దాటకూడదని అనుకున్నారు. సిమ్లా ఒప్పందంలో ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. 

ఇప్పుడు దీని రద్దుతో పర్యవసానాలు..

సిమ్లా ఒప్పందం రద్దుతో అతి ముఖ్యమైన ఎల్వోసీ సరిహద్దు రేఖకు కట్టుబడి ఉండడం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుంది.  ఇన్నాళ్ళు దీనిని స్ట్రిక్ట్ గా అమలు చేశారు కాబట్టే ఇరు దేశాల్లో శాంతి నెలకొంది. ఇప్పుడు కనుక ఇది లేకపోతే విచ్చలవిడిగా ఎవరికి వారు బార్డర్ ను దాటేయొచ్చు. ఇది సైనిక సంఘర్షణలకు దారి తీస్తుంది. అంతకంటే ముఖ్యంగా యుద్ధం సంభవిస్తుంది. ఇవన్నీ తెలిసే పాకిస్తాన్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అంటే భారత్ ను కచ్చితంగా యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టే అని చెబుతున్నారు. దాంతో పాటూ కశ్మీర్ లేదా ఇతర సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు భారత్ ఒప్పుకోవాలి. మన దేశం కనుక అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోకపోతే ఎవరూ ఏం చేయలేరు. కానీ యుద్ధం, చొరబాట్ల విషయంలో మాత్రం ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. 

 today-latest-news-in-telugu | india | pakistan | shimla | agreement 

 

Advertisment
Advertisment
Advertisment