Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
rains

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటకలోని బెంగళూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో కూడా జూన్ 8 నుంచి 10వ తేదీ లోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు

ఆరెంజ్ అలర్ట్ జారీ..

ఈ నైరుతి రుతుపవనాల వల్ల ఏపీ, తెలంగాణలో కూడా రానున్న రెండు లేదా మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!

ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌- మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు ఉండటంతో అధికారులు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్:  చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!

ఇది కూడా చూడండి: Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

Advertisment
తాజా కథనాలు