/rtv/media/media_files/2026/03/11/rain-alert-2026-03-11-20-56-23.jpg)
Rain Alert for Telangana from march 15th
మార్చి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మార్చి 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 14 వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయని.. 15 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముందుగా ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు పడతాయని పేర్కొంది. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
Also Read: పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా.. వరుడు ఎవరో తెలుసా ?
పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ జల్లులు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఎండలు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అకాల వర్షాల వల్ల తాత్కాలిక ఉపశమనం వచ్చినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Follow Us