Weather Report: ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేడు ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

New Update
Weather Department Big Alert andhra pradesh and telangana Rains

Andhra pradesh and telangana Rains

తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వర్షాలు అధికంగా కురవున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

ఇదిలా ఉండగా తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని,  ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. వర్షం కారణంగా కొందరి రైతుల పంటల్లో నీరు చేరాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. 

Advertisment
Advertisment
Advertisment