Virushka Love Story:క్రికెట్, సినిమా ప్రేమకథ..ప్రపంచం మనసు గెలుచుకున్న లవ్ స్టోరీ

క్రికెట్, బాలీవుడ్... ఈ రెండూ విడదీయరాని విషయాలు. క్రికెట్ హీరోలు, సినిమా తారల మధ్య ఎన్నో ప్రేమకథలున్నాయి. వాటిలో నవతరం లవ్‌స్టోరీ అంటే విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలదే. పటౌడీ, షర్మిలా టాగూర్ తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోయిన ప్రేమబంధం వీళ్లదే.

New Update
Virushka Love Story:క్రికెట్, సినిమా ప్రేమకథ..ప్రపంచం మనసు గెలుచుకున్న లవ్ స్టోరీ

Virat-Anushka Love Story:విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... ట్రెండీ స్టయిల్‌లో చెప్పాలంటే విరుష్క. మన దేశంలో ఎక్కువ మంది ఆరాధించే సెలబ్రిటీ జంటల్లో ఈ జంట ముందుంటుంది. ఒకరేమో దేశమంతా ఆరాధించే టీమిండియా కింగ్, మరొకరు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకి. వీరి మధ్య ప్రేమ, పెళ్లి కథలో బయటకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

 ఓ జోక్ కలిపింది వారిద్దరినీ...

2013లో ఒక యాడ్ షూటింగ్‌లో తొలిసారి కోహ్లీ, అనుష్కలకు పరిచయమైంది. మొదటిసారి అనుష్కను కలిసినప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాడట కోహ్లీ. దాన్ని దూరం చేసుకోవడానికి ఆమె హీల్స్ గురించి ఓ జోక్ వేశాడట. నా హైట్ తక్కువే కదా, హీల్స్ వేసుకోవడం అవసరమా అంటూ అనుష్క మీద వేసిన సెటైర్‌కి ఆమె పడీపడీ నవ్విందట. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు. మూడు రోజుల పాటు సాగిన ఆ షూట్‌లో విరాట్, అనుష్క మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ కథ మొదలైన తరువాతి సంవత్సరం... 2014లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన విరాట్ కోహ్లీ తన ఫామ్‌ కోల్పోయాడు. దానికి అనుష్క శర్మనే కారణంగా చూపిస్తూ విమర్శకులు రెచ్చిపోయారు. ఆ తరువాత ఏడాది 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడగా... లక్ష్య ఛేదనలో మన జట్టు తడబడింది. అదే క్రమంలో విరాట్ కోహ్లీ కూడా విఫలం అయ్యాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అనుష్క శర్మనే మరోసారి బాధ్యురాలిని చేస్తూ విమర్శలు వచ్చాయి. అనుష్క ఐరన్ లెగ్ అంటూ ఒక రేంజ్‌లో ట్రోలింగ్ నడిచింది.

Also Read:Bhatti Love Story:ఎల్లలు దాటిన ప్రేమ..పెద్దలు మెచ్చిన వివాహం..భట్టి లవ్‌ స్టోరీ

ఎప్పటికీ అవుటవ్వని బంధం..

అయితే ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ల ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ఆ విమర్శలపైనా ఇద్దరూ ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీంతో ఇద్దరూ విడిపోతారంటూ వార్తలొచ్చాయి. సినిమా హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమలు నిలబడవంటూ చాలామంది కామెంట్ చేశారు. కోహ్లీ, అనుష్క మాత్రం ఏ విమర్శలనీ పట్టించుకోలేదు. కెరీర్‌పై దృష్టి పెట్టారు, తమ ప్రేమనీ కాపాడుకున్నారు. 2015 పూర్తయ్యేసరికి విరాట్ కోహ్లీ ఆటగాడిగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రికార్డుల వేటగాడిగా కొనసాగాడు.

తను మళ్లీ ఫాంలోకి రావడానికి కారణం అనుష్క శర్మే అంటూ బాహాటంగానే ప్రకటించాడు. స్టాండ్స్‌లో అనుష్క ఉన్నప్పుడు గ్రౌండ్‌లోంచే ఆమెకు ముద్దులు కూడా విసిరాడు. ఆమెకు తన గెలుపును అంకితం చేయడం లాంటి సంఘటనలు... వారి బంధం ఎంత దృఢమైనదో అందరికి తెలియజేశాయి. చివరికి తమ బంధాన్ని మూడు ముళ్ళతో కలకాలం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 2017లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి కూతురు పుట్టింది.

సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలబడవు అనే ఫార్ములాకి చెక్ పెడుతూ... ఎంతోమంది నూతన జంటలకి ఆదర్శంగా నిలుస్తోందీ ప్రేమజంట. క్రికెట్ టూర్లతో ఎప్పుడూ బిజీగా ఉండే కింగ్ కోహ్లీ, ఏమాత్రం ఖాళీ దొరికినా భార్య, కూతురుతో గడిపేందుకే ప్రయారిటీ ఇస్తాడు. ఏదో ఒక దీవికి ఫ్యామిలీతో మాత్రమే వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. ముచ్చటైన ఈ ప్రేమజంటకి మనమూ ప్రేమికులరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

#virat-kohli #cricket #cinema #love-story #anushka-sharma
Advertisment
Advertisment
తాజా కథనాలు