/rtv/media/media_files/2025/02/15/09SAk1hced2Jb6itRwsx.jpg)
Ex girlfriend revenge Photograph: (Ex girlfriend revenge)
ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ బానే ఉంటాయి. కాస్త అటుఇటూ అయితేనే జీవితాలు తారుమారు అవుతాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించున్న వారే బ్రేక్‌అప్ అయితే బద్ద శత్రువులుగా మారుతారు. 2025 ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజే ఓ మాజీ ప్రియురాలు ఆమె బాయ్ ఫ్రెండ్‌పై రివేంజ్ తీర్చుకుంది. అది ఎలాగో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతి ఆయుషి రావత్ 100 పిజ్జాలు ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంటికి అడ్రస్‌కు ఆర్డర్ పెట్టింది. వ్యాలంటైన్స్ డే రోజే ఇన్ని పిజ్జాలు పంపించింది అంటే విడిపోయినా ఆమెకు అతనిపై ఎంత ప్రేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
Wtf 😡
— Professor (@Profesir_) February 14, 2025
My ex-girlfriend is taking revenge by sending me 100 pizzas on Valentine’s Day, all on cash on delivery 👿#ValentinesDay #Valentines #HappyValentinesDay #zelena #Chhaava #Valentinesday2025#バレンタインデー #เราต้องการฝ้ายโยโกะ #김지수가_세상을_흔든_아모르타주 pic.twitter.com/xnLWhXSezg
ఆమె మాజీ ప్రియుడి పేరు యష్ సంఘ్వి. ఓ డిలివరీ బాయ్ వచ్చి గురువారం పొద్దున్నే అతని ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేయగానే 100 పిజ్జాలు సింఘ్వి ముందు ఉన్నాయి. అంతలోనే డిలివరీ బాయ్ వచ్చి బిల్ క్యాష్ ఇస్తారా.. యూపీఐ పేమెంట్ చేస్తారా అని అడిగాడు. సింఘ్వికి ఏం అర్థం కాకుండా ఉండి. ఎక్కడివి ఇవన్నీ అని డెలివరీ బాయ్‌ని సింఘ్వీ అడిగితే.. అతను ఇలా అన్నాడు. మీ అడ్రస్‌కు 100 పిజ్జాలు ఆర్డర్ చేశారు. పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు అని చెప్పాడు. అయితే ఆ పిజ్జాలు సింఘ్వి ఆర్డర్ చేయలేదు. వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ చేయలేదు. నేను బిల్ కట్టనని డెలివరీ బాయ్‌కు తెగేసి చెప్పాడు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
తీరా చూస్తూ ఆర్డర్ ఆయుషి రావత్ అకౌంట్ నుంచి ఆర్డర్ అయి ఉన్నాయి. దీంతో అతనికి మొత్తం అర్థం అయ్యింది. తాను వీటిని ఆర్డర్ చేయలేదని, పేమెంట్ కట్టనని డెలివరీ బాయ్‌తో చెప్పాడు. కాసేపు వారి మధ్య వాదన కూడా జరిగింది. తర్వాత డెలివరీ బాయ్ వాటిని రిటన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఇలా ఆయిషి లవర్స్ డే రోజే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ విషయంపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వారి సెటైరికల్ కామెంట్స్‌తో ఈ ఘటన ఇంటర్‌నెట్‌లో ఇంకా వైరల్ అవుతుంది.
Also Read : USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్