/rtv/media/media_files/2025/01/23/QPN55iuGAOXdeCiet3Za.jpg)
A mother And Her Three Daughters Were Humiliated For Allegedly Stealing Clothes
Viral News: పని చేసే కంపెనీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలను దారుణంగా అవమానించారు. వారి ముఖాలకు నల్లరంగు పూసి "మేము' దొంగలము అని రాసి ఉన్న ఫ్లకార్డులను మెడలో వేసి ఊరేగించారు. ఈ అవమానవీయ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో చోటు చేసుకుంది.
Also Read:భారత్ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య
ఒక మహిళ తన కూతుళ్లతో కలిసి పంజాబ్ లూథియానాలోని బహదూర్కే రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గార్మెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే వారు పనిచేసే కంపెనీలో కొన్ని దుస్తులు ఇటీవల కనిపించకుండా పోయాయి. దీంతో వారిని అనుమానించిన యజమాని, మేనేజర్ వారికి శిక్ష విధించారు.మొదట వారిని ఫ్యాక్టరీ ఆవరణలో బంధించారు. అనంతరం వారి ముఖాలకు నల్లరంగు పూసి మెడలో మేము దొంగలం అని రాసి ఉన్న బోర్డులను తగిలించారు. అంతేకాక మేము దొంగతనం చేసినట్లు అంగీకరిస్తున్నామని రాసి మరీ వారిని ఊరేగించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక పోలీసులు స్పందించారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు నెటిజన్లు తీవ్రంగా విమర్శించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కంపెనీ యజమాని పర్వీందర్ సింగ్, మేనేజర్ మన్‌ప్రీత్ సింగ్ తో పాటు వారిని ఊరేగిస్తూ వీడియో తీసి దాన్ని అందరికీ షేర్ చేసిన ముహమ్మద్ కైష్‌పై కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Also Read: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం
కాగా, కాగా ఈ సంఘటన తీవ్ర విమర్శలకు దారి తీయడంతో పాటు మహిళా, పిల్లల హక్కులను హరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ , పంజాబ్ రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్ కన్వర్‌దీప్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను తాలిబాన్ కంటే దారుణంగా శిక్ష విధించినట్లు అభివర్ణించారు. పిల్లల హక్కులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
Ludhiana, Punjab: In Ludhiana, a mother and her three daughters were humiliated for allegedly stealing clothes from a factory. They were forced to wear 'thief' posters, their faces blackened, and a viral video sparked outrage pic.twitter.com/B2ja2OBbOQ
— IANS (@ians_india) January 22, 2025