ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

ట్రాఫిక్‌ జామ్‌లో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు ముంబైలో ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. వాయ్‌ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ మహంగడే పారాగ్లైడింగ్ చేస్తూ 20 నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
student paragliding

student paragliding Photograph: (student paragliding )

మెట్రో సిటీల్లో ఆఫీసులకు, స్కూల్‌కు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ. కొంచెం దూరానికి గంటల తరబడి ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్లాయిస్ టైంకు ఆఫీసులకు, స్టూడెంట్స్ స్కూల్, కాలేజీలకు వెళ్లలేరు. ట్రాఫిక్ ప్రాబ్లమ్ రోజురోజుకు సవాల్‌గా మారుతోంది. ఇక విద్యార్థులకు సైతం ట్రాఫిక్‌ సమస్య తలనొప్పిగా మారుతోంది. పరీక్షల వేళ సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్‌ సెంటర్‌కు టైంకి చేరుకునేందుకు ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. ఏకంగా పారాగ్లైడింగ్‌ చేస్తూ ఇన్‌టైమ్‌కి ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

వాయ్‌ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ మహంగడే అనే విద్యార్థి ఓ పని ఉండి వేరే ప్రాంతం పంచగని వెళ్లాడు. అదే రోజు అతనికి ఎగ్జామ్ కూడా ఉంది. అయితే, వాయ్‌, పంచగని రూట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పసరణి ఘాట్‌ సెక్షన్‌లో చాలాసేపు ఉండాల్సివచ్చింది. సమయం అంతా అక్కడే గడిచిపోయింది. సమర్థ్ ఎలాగైనా ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. అయితే, అతడికి అంత టైమ్‌ లేదు. 20 నిమిషాల్లో కాలేజీకి చేరుకోవాల్సి ఉంది. దీంతో ట్రాఫిక్‌‌ను తప్పించుకొని కాలేజ్‌కు చేరుకోడానికి అతడు పారాగ్లైడింగ్‌ ఎంచుకున్నాడు.

Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

ఇందుకోసం అతడికి పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్‌కు చెందిన పారాగ్లైడర్ గోవింద్ యెవాలే సహాయం చేశాడు. అతడి సాయంతో సమర్థ్ ఆకాశంలో ఎగురుతూ 15 కిలో మీటర్ల దూరం కేవలం 5 నిమిషాల్లోనే చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. సమర్థ్ సమయస్పూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శభాష్ సమర్థ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment