/rtv/media/media_files/2025/02/12/ZyW0NXw9OnoYLkxgWnag.jpg)
Viral Video brazil Photograph: (Viral Video brazil)
Viral Video: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్(Smartphone) యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా కూడా అందరూ మొబైల్ పట్టుకునే కనిపిస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ తోనే గడుపుతున్నారు. మొబైల్ పేలిపోవడం, ఛార్జింగ్(Mobile Charging) పెట్టినప్పుడు మంటలు రావడం వంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఇలానే మొబైల్ పేలిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!
SHOCKING: మహిళ ప్యాంట్లో పేలిన సెల్‌ఫోన్
— Swathi Reddy (@Swathireddytdp) February 12, 2025
బ్రెజిల్‌లో చోటు చేసుకున్న ఘటన
భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలిన ఫోన్
ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు pic.twitter.com/VwSphy6ExR
ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!
భర్తతో కలిసి షాపింగ్ చేస్తుండగా..
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లో ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌కి వెళ్లి షాపింగ్ చేస్తోంది. ఆమె వెనుక పాకెట్‌లో తన మొబైల్‌ను పెట్టుకుని ఉంది. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆమె వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చుట్టూ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో వీడియో బయటకు వచ్చింది.
ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది తాజాగా జరిగిన సంఘటన కాదని, గతంలో జరిగిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొబైల్ ఫోన్‌తో కాస్త జాగ్రత్తగా ఉండండి. వెనుక పాకెట్‌లో మొబైల్ ఫోన్ పెట్టవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్!