/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/social-jpg.webp)
సోషల్ మీడియాలో చెత్త చెత్త ఛాలెంజ్ లు వస్తుంటాయి. ఎవరూ చేయలేని పనులు, అసాధ్యమైనవి చేయమని అడుగుతుంటారు. ఇలాంటివి పిల్లలు, యువత చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. రోజూ ఎంతో మంది వీటివల్ల ప్రాణాలు పోయాయని వింటున్నా వాటి మీద క్రేజ్ తగ్గించుకోవడం లేదు. తాజాగా బ్రెజిల్ లోని ఓ 14 ఏళ్ళ బాలుడు ఇలాగే ఓ చెత్త ఛాలెంజ్ ను సీరియస్గా తీసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
సీతాకోక చిలుకను చంపి..శరీరంలోకి..
బ్రెజిల్‌లోని విటోరియా డా కాన్క్విస్టాకు చెందిన 14 ఏళ్ల డేవి నూన్స్ మెరీరా...విపరీతంగా సోషల్ మీడియాను ఫాలో అవుతాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్ లో ఓ ఛాలెంజ్ ను చూసి తీసుకున్నాడు. దాని వలన ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడి ప్రాణాలు తీసిన ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా..ఓ సీతాకోక చిలుకను పట్టుకుని దాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. దీన్నే మెరీరా సీరియస్ గా తీసుకున్నాడు. ఓ సీతాకోక చిలుకను పట్టుకుననాడు. దాన్ని చంపేసి...నలిపి నీళ్ళల్లో కలిపేశాడు. ఆ తర్వాత ఆ వాటర్ ను తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు.
ఇలా చేసిన తర్వాత కాసేపు మెరీరా బాగానే ఉన్నాడు. తర్వాత సడెన్ గా కొన్ని గంటల తర్వాత వాంతులు మొదలయ్యాయి. అవి ఆగకుండా చాలాసేపు కంటిన్యూ అయ్యాయి. దీంతో అతని తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ఆసుపత్రిలో డాక్టర్లు మెరీరా ఏం తిన్నాడో అడిగారు. తల్లిదండ్రులు లిస్ట్ అంతా చెప్పారు. తర్వాత బాలుడి దగ్గరకు వెళ్ళి అడగ్గా అసలు విషయం చెప్పాడు. వెంటనే అక్కడి వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి బాలుడి మీద కేర్ తీసుకుంటూ 24 గంటలపాటూ అన్ని రకాల చికిత్సలూ చేశారు. కానీ ఏం చేసినా మెరీరాను మాత్రం బతికించలేకపోయారు.
బాలుడు చనిపోవడంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మెరీరా ఎవరిని చూసి ఇదంతా చేశాడాని ఆరా తీశారు. అతని ఫోన్, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాలుడు ఉపయోగించిన సిరంజిని, మిగిలి ఉన్న సీతాకోక చిలుక అవశేషాలను కూడా గుర్తించారు. మరోవైపు మెరీరా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవరో చేసిన పిచ్చి ఛాలెంజ్ తమ బిడ్డ ప్రాణాలు తీసిందని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.
Also Read: Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్