/rtv/media/media_files/2025/01/16/nsj6ASky7o0uM9PiNkDA.jpg)
aadhar card loan Photograph: (aadhar card loan )
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ స్కీమ్ అయిన ప్రైవేట్ సంస్థలలో జాబ్ అయినా పొందలేము. స్కూల్ అడ్మిషన్ నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభించడం వరకు అన్నింటికీ ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. అయితే ఆధార్ కార్డుపై కూడా లోన్ పొందవచ్చు అని విషయం మీకు తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి తప్పేం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు.
కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది. 2020లో ప్రారంభించబడిన ఈ పథకంలో మీరు ఆధార్ కార్డ్ ఆధారంగా రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. దీనికి గానూ ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. అంటే ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదన్న మాట.
ఈ ప్లాన్ ఎలా పని చేస్తుంది?
ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద లోన్ పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. వ్యాపారులు ఈ పథకం కోసం ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత వ్యాపారులకు రూ.10,000 వరకు లోన్ ఇస్తారు. మీరు ఈ లోన్ ను సకాలంలో చెల్లిస్తే, మీ ఆధార్ కార్డుపై రూ.20,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని కూడా నిర్ణీత గడువులోగా చెల్లిస్తే రూ.50 వేల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. కానీ 12 నెలల్లో అంటే ఏడాదిలో తీసుకున్న మొత్తం లోన్ ను వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆధార్ కార్డుతో ప్రధాన మంత్రి స్వానిధి యోజన కింద లోన్ పొందడానికి, మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా pmsvanidhi.mohua.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు వ్యక్తిగత, వ్యాపార సమాచారం, ఆధార్ కార్డ్‌తో సహా మీ అన్ని వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఈ లోను తీసుకోవాలంటే కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనాలు పొందుతున్నారు. ఇప్పటివరకు 80 లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ పథకం కింద లోన్లు తీసుకున్నట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Also Read : USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన