Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

ముంబై ఎయిర్‌పోర్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. కళ్లు కూడా తెరవని ఓ శిశువు బాత్రూమ్‌లోని చెత్త డబ్బాలో కనిపించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విమానాశ్రయం టెర్మినల్ 2 లోని వాష్‌రూమ్‌ను సిబ్బంది క్లీన్ చేస్తుండగా నవజాతి శిశువు మృతదేహం లభించింది.

Also Read :  థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!

Also Read :  ముంబై ఎయిర్‌పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు

వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా..

వెంటనే సిబ్బంది అధికారులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియదు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే కావాలనే శిశువుని హత్య చేశారా? లేకపోతే పుట్టిన తర్వాత చెత్త డబ్బాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

Latest crime news | new-born-baby | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

విశాఖపట్నం జిల్లా కొమ్మాది స్వయం కృషినగర్‌లో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కత్తితో దాడి చేశాడు ఉన్మాది. దాడిలో తల్లి మృతి కూతురికి తీవ్రగాయాలు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో నిందితుడు.

New Update
crime news vishaka

crime news vishaka

AP Crime: ఏపీలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇద్దరిని బలి తీసుకున్న ప్రేమోన్మాది:

 ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

( AP Crime | ap-crime-news | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment