AP Crime: గుంటూరులో హై టెన్షన్ .. యువకుడిపై ఎస్సై తుపాకీతో దాడి

గుంటూరులోని ఫిరంగిపురంలో ఎస్సై ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. స్థలం ఫోర్జరీ చేసుకున్నారనే విషయంలో గొడవ జరుగుతుండగా యువకుడు వీడియో తీశాడు. దీంతో ఎస్సై తుపాకీతోొ దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

New Update
Guntur

Guntur Photograph: (Guntur )

AP Crime: గుంటూరు(Guntur)లో హై టెన్షన్ చోటుచేసుకుంది. ఫిరంగిపురం శాంతి నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లెలోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో చిన్ని కృష్ణ అనే కుటుంబానికి గ్రామస్థులకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

యువకుడికి గాయాలు కావడంతో..

ఈ సమయంలో ఓ యువకుడు వీడియో తీస్తుండగా సీఐ రవీంద్ర బాబు తుపాకీతో దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్థులు సీఐపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల కారుపై రాళ్లు వేసి ఆందోళన చేపట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. సీఐ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ సెంటర్‌లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.  

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ. 20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రైడ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ ,అతని పర్సనల్ డ్రైవర్ లను పట్టుబడ్డారు. ఈ సంఘటనపై  సంఘటన స్థలానికి చెరుకుని శాఖపరమైన విచారణ చేపట్టినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment