/rtv/media/media_files/2025/03/25/9AP9xMY3aldV3XTEvEb7.jpg)
iphone-women
లక్షా యాభై వేల ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన అమ్మాయి తన తల్లిదండ్రులు రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపం చెందింది. దీంతో బ్లేడుతో తన చేతి మణికట్టును కోసుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వలనే తమ కూతురు ఫోన్ అడిగితే నిరాకరించడానికి కారణమని తల్లిదండ్రులు వెల్లడించారు.
Also Read : టాస్ గెలిచిన గుజరాత్.. పంజాబ్ బ్యాటింగ్ !
అమ్మాయి మూడు నెలలుగా తన తల్లిని ఐఫోన్ అడుగుతూనే ఉంది. తనకు కాబోయే భాగస్వామితో మాట్లాడలేకపోతున్నానని చెబుతోంది. తల్లి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఐఫోన్ కొని ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ అమ్మాయి ఒక గదిలో వెళ్లి తన ఎడమ చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంది. దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Also Read : ఉద్యోగులకు IBM ఊహించని షాక్.. 9 వేల మంది ఔట్!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా
ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ, తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కూతురికి అంత ఖరీదైన మొబైల్ ఇవ్వలేకపోయామని అన్నారు. మేము పేదవాళ్ళమని.. ఆమెకు అంత ఖరీదైన మొబైల్ ఎలా కొనివ్వగలమన్నారు.తన భర్త కూలీ పని చేసి సంపాదించే డబ్బుతోనే తమ ఇల్లు నడుస్తోందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. అమ్మాయి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడింది, ఇకపై అలాంటి పనులు చేయనని తెలిపింది. డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. గాయాలు లోతుగా లేవని... కానీ చేతులు పూర్తిగా బ్లేడుతో కట్టువేశామన్నారు. కొన్ని రోజులు చికిత్స అవసరమని తెలిపారు.
Also read : Marriage : ఎంతకు తెగించావ్ రా.. ఉదయం లవర్తో.. రాత్రి మరో అమ్మాయితో
Also Read : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అవినాష్ కు చంద్రబాబు సర్కార్ ఝలక్!
bihar | iphone | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu