/rtv/media/media_files/2025/01/31/ay9LAqX88fDyxqerz1Kk.jpg)
Daughter killed father ap Illegal affair case
Daughter killed father: ఓ కూతురు చేస్తున్న పాడు పని వద్దని చెప్పినందుకు తండ్రిపై దారుణానికి పాల్పడింది దుర్మార్గురాలు. ప్రియుడితో అక్రమ సంబంధం మంచిది కాదని, మానుకోవాలని మందలించిన కన్నవాడినే కాటికి పంపింది. ప్రియుడు, మరికొంతమంది సహకారంతో హతమార్చి అనుమానస్పద మృతిగా క్రియేట్ చేసింది. అయితే స్థానికులు, మృతుడి సన్నిహితుల ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.
పరువు పోతుంది మానుకోవాలని..
ఈ మేరకు మండపేట టౌన్ సీఐ దారం సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండపేటలో మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది.
మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. కూతురు వెంకట దుర్గ రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు.. వెంటనే మానుకోవాలని, పరువు పోతుందని హెచ్చరించాడు. అయితే తండ్రి మందలించిన విషయాన్ని అర్థం చేసుకోకుండా పగ పెంచుకుంది దుర్గ. దీంతో ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేసింది. మార్చి16న రాంబాబు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సురేష్, అతని ఫ్రెండ్ తాటికొండ నాగార్జునను ఇంటికి పిలిచింది. ముగ్గురూ కలిసి మంచంపై పడుకున్న రాంబాబు మీద కూర్చోని శ్వాస ఆడకుండా గొంతు పిసికి చంపేశారు.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
ఆ తర్వాత తండ్రి నిద్రలోనే కన్నుమూశాడంటూ తనకేమి తెలియనట్లు నటించింది. మృతుడి సోదరుడు సూరా పండు రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దుర్గ నిజం ఒప్పుకోగా.. నిందితులను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్
today telugu news | latest-telugu-news