Murder: రైల్వేస్టేషన్‌లో దారుణం.. తండ్రీకూతురిని తుపాకితో కాల్చి చంపిన యువకుడు!

బిహార్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన తండ్రీకూతురు అనిల్‌ సిన్హా, ఆరాను అమన్‌కుమార్‌ తుపాకితో కాల్చిచంపాడు. ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి నడుస్తుండగా కాల్చేశాడు. అమన్ కూడా కాల్చుకుని చనిపోయాడు.

New Update
Gun

Bihar Railway Station Father and Daughter Murdered

Murder:  బిహార్‌ రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. అప్పటిదాకా ప్రయాణికులతో కలకలలాడిన స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రి, కూతురిని ఓ వ్యక్తి దారుణంగా హతమార్చగా పట్టపగలే  రైల్వే ప్లాట్‌ఫామ్‌లో  నెత్తురు ఏరులై పారింది. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది, ప్యాసింజర్స్ పరుగులు పెట్టారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అతాలకుతలమైన పోలీసులు.. కాసేపటికి అప్రమత్తమయ్యేలోపు రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

అక్కడిక్కడే ప్రాణాలు..

ఈ మేరకు తండ్రి అనిల్‌ సిన్హా, తన 16 ఏళ్ల కూతురు ఆరాతో కలిసి రైల్వే స్టేషన్ వచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు తాను వెళ్లాల్సిన ట్రైన్ కోసం 3,4 ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి నడుస్తున్నారు. ఈ క్రమంలోనే కనురెప్పచాటున భోజ్‌పుర్‌కు చెందిన అమన్‌కుమార్‌ (24) తుపాకితో వారిద్దరినీ కాల్చేశాడు. బుల్లెట్ దెబ్బలకు తండ్రీకూతుళ్లిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

అయితే ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడు సైతం అదే తుపాకితో అక్కడే కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సివుండగా కేసు నమోదు చేసుకుని ప్రేమ వ్యవహారం కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

railway-station | father-and-daughter | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment