Chhattisgarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు

రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.

New Update
Chhattisgarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు

Encounters: ఛత్తీస్‌ఘడ్‌లో పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు వదులుతున్నారు. దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో స్తర్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమావేశం పెట్టుకున్నారు. దీని గురించి తెలుసుకున్న భద్రతా బలగాలు...ప్లాన్ ప్రకారం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులు, పోలీసుల ఒకరికి ఒకరు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. దాంతో పాటూ పలువురు పోలీసులు కూడా పడ్డారని చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కూడా మావోయిస్టు గాలింపు చర్యలు చేస్తున్నారు. అక్కడ కూడా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని సమాచారం.

ఇప్పుడు పోలీసుల చర్యల మీద ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు మావోయిస్టులు. పక్కావ్యూహాలతో భద్రతాబలగాలపై దాడులకు ప్లాన్‌లు వేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.పీఎల్జీఏ వ్యూహాలను చేధిస్తూ అడవుల్లోకి చొచ్చుకెళుతున్నారు సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు.
వరుస ఎన్కౌంటర్లు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దండకారణ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ సరిహద్దులో మావోయిస్టుల రాకపోకలపై డేగకన్ను ఉంచారు. గాలింపు చర్యల్లో భాగంగా మావోయిస్టుల నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో మొత్తంగా 18 మంది చనిపోయారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని అంటున్నారు. మరోవైపె చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఏజెన్సీలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

ఇక మరోవైపు భద్రతా బలగాల అటాక్‌కు నిరసనగా ఈరోజు ఏజెన్సీలో బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. చత్తీస్‌ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏజెన్సీల్లో బంద్ నిర్వహించాలని మావోయిస్టులు కోరుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నిన్న రాత్రి నుంచి మారు మూల గ్రామాలకు బస్‌లను నిలిపివేసింది తెలంగాణ ఆర్టీసీ. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Also Read:Crime News: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు