భార్య, పిల్లల్ని చంపిన హత్య కేసు.. దోషికి ఉరిశిక్ష
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనే రాత్రి బస చేసిన కౌశిక్‌రెడ్డికి ఈరోజు ఉదయం స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను నేడు జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూట్ మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు.
డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.
రైతుల ఆలోచనల మేరకే రైతు భరోసా పథకం ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసాను గత పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు. సాగు యోగ్యమైన భూములకే తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు.
కడపలో ఉప ఎన్నిక వస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ కడప పౌరుషాన్ని ఢిల్లీని తాకేలా చేస్తానన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు.
బీజేపీ అధికారంలోకి రాగానే..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ .అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసే వరకు పోరాడతామని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.