Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి

పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.

New Update
Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి

Child Care: ప్రస్తుత కాలంలో పిల్లలు పూర్తిగా మొబైల్, టీవీలకు బానిసలయ్యారు. టీవీ పెట్టకపోయినా, మొబైల్ ఫోన్‌లో తమకు ఇష్టమైన వీడియో ప్లే చేయకపోయినా తినబోమని మొండికేస్తున్నారు. అయితే పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను చూసుకునే విధానం వారి మొత్తం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడానికి తల్లిదండ్రులకు భోజన సమయం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.

పిల్లలు భోజనం చేసేటప్పుడు టీవీ ఎందుకు చూడకూడదు?

భోజన సమయాల్లో టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల పిల్లలు ఆకలితో ఉన్నారా లేదా కడుపు నిండుగా ఉన్నారో తెలియదు. వారి శరీరం ఏమి చెబుతుందో వారికి తెలియదు. ఇది అతిగా తినడం లేదా తక్కువ తినడం, ఊబకాయం లేదా పోషక అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది. భోజన సమయంలో పిల్లలను వారి ఆహారంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని వైద్యులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల తిన్నది వంటపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా టీవీల్లో వచ్చే ప్రకటనలు కూడా పిల్లల మనసులపై ప్రభావం చూపుతాయి. వాణిజ్య ప్రకటనలు, ఆకర్షణీయమైన దృశ్యాలు, సంగీతం పిల్లలను ఆకర్షిస్తాయి. ఈ ప్రకటనల్లో చాలా వరకు చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఉత్పత్తులను ప్రచారం చేస్తాయి. ఇది చూసి పిల్లలు ఆ ఆహారం కావాలని పట్టుబట్టవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు. భోజన సమయాల్లో టీవీని చూడడం తగ్గిస్తే ఆహార ప్రాధాన్యతలపై ఈ ప్రకటనల ప్రభావాన్ని తగ్గించవచ్చని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

నిపుణుల సలహా:

వంట చేసేటప్పుడు మీ పిల్లలను చిన్న చిన్న పనులు అప్పగించాలి. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలని అంటున్నారు. పిల్లలకు ఇష్టంలేని ఆహారాన్ని బలవంతంగా ఇవ్వడం వల్ల వారికి భోజనం పట్ల విరక్తి ఏర్పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా శిశువుకు ఎప్పుడూ అతిగా ఆహారం ఇవ్వొద్దని ఆకలిగా ఉన్నప్పుడే తినిపించాలని అంటున్నారు.

ఇది కూడా చదవండి: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Govt : అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

New Update
Telangana State Tourism Development Corporation

Telangana State Tourism Development Corporation

 TG Govt :   కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  మాట్లాడుతూ కశ్మీర్‌లో చిక్కుకున్నవారిని తిరిగి రప్పించడానికి  రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యట‌క శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రదాడిలో తెలంగాణ వారు ఎవరు మరణించలేదన్న ఆయన పర్యాటకులు ఎవరైన కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. దానికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

అలాగే ఇటీవల జమ్ము, కశ్మీర్ లో పర్యటించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. దీనివల్ల పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప‌ర్యట‌క శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామ‌ని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ విషయమైన హెల్ప్ లైన్ నంబ‌ర్లు: 9440816071, 9010659333, 040 23450368 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

 పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.కశ్మీర్‌తో పరిసర ప్రాంతాల్లో పర్యటకులు ఎవరైనా చిక్కుకున్నా వారి నుంచి బంధువులకు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే హెల్ప్‌లైన్‌ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment