/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/TS-Cabinet-meeting-Ponguleti-Srinivas-Reddy-.jpg)
Telangana Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను (Dharani Portal) భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీకి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఉండనున్నారు. ఈ రోజు సుమారు గంటన్నర పాటు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు.గౌరవెల్లి ప్రాజెక్టు రూ.437 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా జాబ్ క్యాలెండర్ ను (Job Calendar) సైతం ఆమోదించింది. రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. వయనాడ్ మృతులకు సంతాపం తెలిపింది. అక్కడి బాధితులకు సాయం చేయాలని నిర్ణయించింది. క్రికెటర్ సిరాజ్ (Mohammed Siraj), బాక్సర్ నిఖత్ జరీన్‌కు (Nikhat Zareen) డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సబ్‌కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉంటారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీ పేర్లను మరోసారి కేబినెట్ గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ మీటింగ్ లో తీర్మానించారు. విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ?
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్ పేట చెరువుకు తరలించాలని నిర్ణయించారు.
అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.