ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇండియా నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న హిందువులు, సాధువులు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చారు. చాలామంది బాబాలు, సాధువులు కుంభమేళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి : యూట్యూబర్‌ను పట్టుకారుతో తరిమికొట్టిన బాబా.. వీడియో వైరల్!
మొన్న ఐఐటీ బాబా అభయ్ సింగ్, నిన్న డిజిటల్ బాబా, బ్యూటీ సాద్వీ రిచారియా సోషల్ మీడియాలో వైరల్‌గా కుంభమేళలో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తాజాగా ఇంటర్‌నెట్‌లో బాడీ బిల్డర్ బాబా వీడియోస్, ఫొటోస్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. రష్యా చెందిన బాబా కుంభమేళ 2025కు వచ్చారు. ఆయన 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగి సిక్స్ ప్యాక్‌తో బాడీ బిల్డర్‌లా ఉన్నాడు. కాషాయ దుస్తువులు ధరించి.. రుద్రాక్ష మాల పట్టుకున్న ప్రేమ్ గిరి మహారాజ్ వార్తల్లో నిలిచాడు. మస్క్యులర్ బాబాగా ట్రెండ్ అవుతున్నాడు.
ఇది కూడా చదవండి :బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్
ఇతని ఫొటోలు చూసిన వారు హిందూ పురాణాల్లో బలశాలి అయిన దేవుడు పరశురాముడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణవు అవతారం మోడ్రన్ పరుశరాముడు అంటూ గిరి మహారాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నారు. రష్యాకు చెందిన గిరి, 30 సంవత్సరాల క్రితం సనాతన ధర్మాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన హిందూ మతాన్ని వ్యాప్తికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆధ్యాత్మికంలోకి రాకముందుకు గిరి ఉపాధ్యాయుడిగా పని చేశాడు. అతను నేపాల్‌లో నివసిస్తున్నాడు. తన జీవితాన్ని హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ గడుపుతున్నాడు. ప్రేమ్ గిరి మహారాజ్ జునా అఖారా సభ్యుడు.
ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్