Amit Shah : మోదీ 3.O ప్రభుత్వంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతం అవుతాయి : అమిత్ షా ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని ధ్వజమెత్తారు. రాబోయే మోదీ 3.0 పాలనలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా లేకుండా పోతుందని అన్నారు. By B Aravind 18 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi Government : ఢిల్లీ(Delhi) లో బీజేపీ(BJP) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగుతున్న ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ(Congress Party) పై తీవ్రంగా విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్.. అయోధ్య(Ayodhya) లో రామ్‌లల్లా(Ram Lalla) ప్రాణ ప్రతిష్ట(Prana Pratishtha) కార్యక్రమాన్ని బహిష్కరించిందని ధ్వజమెత్తారు. వారసత్వ, అవినీతి రాజకీయాల సంస్కృతి కలిగిందే ఇండియా కూటమి అంటూ ఎద్దేవా చేశారు. Also Read : దేశంలో పాపులర్ సీఎం ఎవరో తెలుసా ? ఉగ్రవాదం, నక్సలిజం అంతం అవుతాయి ప్రధాని మోదీ(PM Modi) పాలనలో.. ఉగ్రవాదం, నక్సలిజం కొన ఊపిరితో ఉందని.. మరోసారి రాబోయే మోదీ హయాంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాపై విపక్ష పార్టీలు ఒక్క అవినీతి గురించి ఆరోపణలు చేయలేకపోయాయి. 7 కుటుంబ పార్టీల సమాహారమే ఇండియా కూటమి అని అమిత్ షా అన్నారు. వారసత్వ కూటమి వర్సెస్ ప్రజాస్వామ్య కూటమి మధ్య రానున్న ఎన్నికల్లో యుద్ధం జరగనుందని వ్యాఖ్యానించారు. 'ఇండియా కూటమి అధికారంలో ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయి. గతంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆర్టికల్ 370పై చేసిన వ్యాఖ్యలను.. పాకిస్థాన్ ఏకంగా ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశ ద్రోహ చర్యలేనని' అమిత్ షా అన్నారు. ఇక అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో ఓబీసీ రిజర్వేషన్ అమలు చేశామని.. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉందని అన్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర బీజేపీదని పేర్కొన్నారు. Also Read : కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన #WATCH | Delhi: Union HM Amit Shah says, "What is their (INDIA alliance) objective in politics? PM Modi aims at self-reliant India. Sonia Gandhi's aim is to make Rahul Gandhi the PM , Pawar Saheb's aim is to make his daughter the CM, Mamata Banerjee's aim is to make her nephew… pic.twitter.com/lyx6slNRac — ANI (@ANI) February 18, 2024 #telugu-news #pm-modi #national-news #bjp #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి