Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక

హౌతీ తిరుగుబాటు దారులు ఎర్రసముద్రంలో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆపాలంటూ చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తమకు ఏదైనా హానీ జరిగితే.. టెహ్రాన్‌తో వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పాలని ఇరాన్‌కు ఆదేశించినట్లు సమాచారం.

New Update
Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక

China : ఎర్రసముద్రంలో హౌతీ(Houthis) తిరుగుబాటుదారులు గత కొన్ని రోజులుగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ దాడుల్ని ఆపాలంటూ ఇరాన్‌ను చైనా హెచ్చరించింది. చైనా(China) ప్రయోజనాలకు హానీ కలిగితే.. అది ఇరాన్‌ రాజధాని అయిన టెహ్రన్‌తో ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండని ఇరాన్‌(Iran) కు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్‌ వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకలపై దాడులు 

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ - హమాస్‌(Israel - Hamas) మధ్య గత కొంత కాలంగా దాడులు జరుగుతున్న వేళ.. తాజాగా ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఇజ్రాయిల్‌ వైపుకు వెళ్లే.. అక్కడి నుంచి వచ్చి నౌకలు.. లేదా ఆ దేశంతో సంబంధాలున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ఇటీవల హౌతీ రెబల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ వైపుకు వస్తున్న ఓ నౌకను హైజాక్‌ చేయడంతో పాటు.. ఇండియాలో తయారైన జెట్ ఇంధనాన్ని తీసుకెళ్తున్న ఆర్ట్‌మోర్‌ అనే నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

Also Read : తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు..

మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చు

అయితే హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు.. అమెరికా, బ్రిటన్‌లు కలిసి హౌతీ నౌకలపై దాడులు చేశాయి. అయితే ఈ దాడులు తీవ్రతరమైతే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగొచ్చని ఇటీవలే ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్‌(Dennis Francis) కూడా అనడం దుమారం రేపింది. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఉన్న వాణిజ్య మార్గంలో ఎర్ర సముద్రం ఉంది. చమురు, ఆహార ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఎన్నో రవాణా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఎర్రసముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే టెహ్రాన్‌తో తమ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయనేదానిపై చైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఇరాన్ వర్గాలు చెప్పాయి.

Also Read: మైక్రోసాఫ్ట్‌ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్

ట్రంప్ సుంకాల దెబ్బ గట్టిగానే పడుతోంది. కార్ల మీద కూడా దీని ఎఫెక్స్ చూపిస్తోంది. పెద్ద కంపెనీలు తమ కార్ల ఎగుమతులపై ఆలోచిస్తున్నారు. తాజాగా జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్ బ్రిటిష్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది.

New Update
usa

JLR cars

జాగ్వారా, ల్యాండ్ రోవర్ బిట్రన్ లో తయారయ్యే కార్లు. టాటా మోటార్స్ కు చెందిన లగ్జరీ కార్లు ఇవి. బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్‌ సంస్థ..  బ్రిటన్‌లో సుమారు 38 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ తమ కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నెల పాటూ ఆపాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25శాతం టారీఫ్ లను విధించారు. దీంతో టాటా జాగ్వార్ తమ కార్ల ఎగుమతులను నెలపాటూ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ది టైమ్స్ చెబుతోంది. సుంకాలను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించడానికే ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆలోచనలో పడ్డ అన్ని కంపెనీల కార్లు..

జెఎల్ ఆర్ ఒక్కటే కాదు..ఇతర దేశాల్లో తయారయ్యే అన్ని కార్ల కంపెనీలు ఇదే ఆలోచనలో పడ్డాయని చెబుతున్నారు. అయితే జే ఎల్ ఆర్ ఇప్పటికే మరో రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఎగుమతి చేసేసింది. అందుకే ఇప్పుడు నెల గ్యాప్ తీసుకున్నా పర్వాలేదని భావిస్తోంది. ఈ నెలలో సుంకాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటోంది. 2024 మార్చి వరకు 12 నెలల వ్యవధిలో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ 4.30 లక్షల వాహనాలను విక్రయించగా.. అందులో నాలుగో వంతు అమెరికాలో అమ్ముడయ్యాయి. మరోవైపు ట్రంప్ ప్రకటించిన టారీఫ్ లవలన టాటా మోటార్స్ షేర్లు బాగా పడిపోయాయి.   

 today-latest-news-in-telugu | cars | tata-motors

Also Read: USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు

Advertisment
Advertisment
Advertisment