Kamareddy : కామారెడ్డిలో హైటెన్షన్.. ఈటల హౌస్ అరెస్ట్!
కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
చంచల్ గూడ జైల్లో ఉన్న లష్కర్ ఉగ్రవాదులు మరోసారి నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారన్న వార్త కలకలం రేపింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని అవన్నీకేవలం వదంతులేనని పోలీసులు తేల్చి చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నజాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 1100 కీలకమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది.
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలోని మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఈ నెల 23న క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బడ్జెట్ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.