భారీ వర్షం.. కళ్లముందే ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. అయితే.. మాటకు మాటతో వివాదాన్ని పెద్దది చేయకూడదని కేటీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కొండా సురేఖ 2009-14 మధ్యలో కూడా నిత్యం వార్తల్లో నిలిచారు. జగన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ద్రోహి అన్న ఆరోపణలను ఆ సమయంలో ఎదుర్కొన్నారు సురేఖ. ప్రస్తుతం సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని రేవంత్ కు స్పష్టం చేసినట్లు సమాచారం.
తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుంది. స్టేజ్ కుప్పకూలడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సినీనటి ప్రియాంక మోహన్ కు ప్రమాదం తప్పింది.
వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదని మెజార్టీ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావిస్తూ సురేఖకు సపోర్ట్ చేస్తున్నారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.