కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్.. మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Konda Surekha: మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల సమంత, కేటీఆర్‌లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను(KTR) విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత(Samantha) , నాగచైతన్య (NagaChaitanya) కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చివరికి ఈ వ్యవహారంపై కొండా సురేఖ కూడా స్పందిచారు. ''నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ (సమంత) మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ'' కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. #ktr #rahul-gandhi #konda-surekha #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి