/rtv/media/media_files/2025/04/12/yq5Diq9ofWTCSwnhKSFG.jpg)
vijaya
డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతిని , ఆమె భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయశాంతి భర్త ఎం. వి శ్రీనివాస ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం ఎం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చంద్రకిరణ్ చెప్పుకున్నాడు. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్‌కు శ్రీనివాస ప్రసాద్ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు.
Also Read: West Bengal: బెంగాల్‌లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం
కానీ చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి గురించి సోషల్ మీడియాలో పనిచేస్తున్నాని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కూడా కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలని శ్రీనివాసప్రసాద్ మెసేజ్‌లో తెలిపారు.కానీ అతడు మాత్రం ఇంటికి రాలేదు. అంతేకాకుండా ఇటీవల ‘‘నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కీడుస్తా.. కసితీరే వరకు అతి దారుణంగా చంపుతాను’’ అంటూ చంద్ర కిరణ్ రెడ్డి మెసేజ్ ద్వారా శ్రీనివాస ప్రసాద్ ను బెదిరించాడు.
Aslo Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
దీనిపై స్పందించిన విజయ శాంతి దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునే పని లో పడ్డారు. విజయ శాంతి సినిమా కెరియర్ విషయానికొస్తే తాజాగా ఆమె "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" సినిమాలో ఐపీఎస్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: America -Trump: ట్రంప్ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్!
Also Read: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
vijayasanthi | vijayasanthi new post | mlc | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates