V.C. Sajjanar: బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మాస్ వార్నింగ్!

వీ.సీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నివారణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా యువతలో అవేర్నెస్‌కు తెరలేపారు. ‘బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి. బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం. అంటూ ఓ పోస్టు పెట్టారు.

New Update
VC Sajjanar mass warning to YouTubers promoting betting apps

VC Sajjanar mass warning to YouTubers promoting betting apps

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వీ.సీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరి బండారం బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి యూట్యూబర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. మరికొందరిని కూడా ఆయన టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

ఇక ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన.. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, హర్షసాయి, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. మరోవైపు వీ.సీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతాలో యువతలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. 

రంగు పడుద్ది

ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ చేశారు. ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది!’ అనే క్యాప్షన్‌తో.. ‘‘మీలో ఎంతమంది బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఫేక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ల అకౌంట్లను రిపోస్ట్ చేసి బ్లాక్ చేయగలరు?.. అలాగే మీ స్నేహితులను కూడా ట్యాగ్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన స్క్రీన్‌షార్ట్‌ను DM! కు పంపించండి.’’ అని తెలిపారు.

 

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

బెట్టింగ్ నివారణ ఉద్యమం

దీంతో పాటు ఆయన ‘‘బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి’’ అంటూ మరో పోస్టు పెట్టారు. ‘‘బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందన బాగుంది. బెట్టింగ్ అవగాహన వీడియోలను రూపొందించడానికి అనుమతి కోరుతూ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు నన్ను సంప్రదిస్తున్నారు. ఇది శుభపరిణామం.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తోన్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే ఇలానే ముందుకు సాగండి. ఈ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయండి!. మనమంతా కలిసి సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం.’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు