Boggula Srinivas: బొగ్గుల శ్రీనివాస్‌ ది సుపారీ హత్యే... కేసును ఛేదించిన పోలీసులు

యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ మరణం పై సస్పెన్స్‌ను పోలీసులు చేధించారు. ఆయనది సుపారీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయని ఖమ్మం గ్రామీణ పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.

New Update
FotoJet (37)

Boggula Srinivas

Boggula Srinivas  : యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ (48) మరణం పై సస్పెన్స్‌ను పోలీసులు చేధించారు. ఆయనది సుపారీ హత్య(supari gang attack issue) గా పోలీసులు నిర్ధారించారు.  ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య(supari-murder) కు దారితీసిందని ఖమ్మం గ్రామీణ పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు వేణుమాధవరెడ్డి సుపారీ ముఠాకు డబ్బులిచ్చి వారితో ఈ హత్య చేయించినట్లు తేల్చారు. బొగ్గుల శ్రీనివాస్‌ జీఎస్టీ(gst) పర్మిషన్‌ను మాధవరెడ్డి వాడుకున్నాడు. జీఎస్టీ ఎగ్గొట్టడంతో శ్రీనివాస్‌కు అధికారులు నోటీసులు పంపారు. అయితే ఒప్పందం మేరకు నగదు ఇవ్వాలని.. జీఎస్టీని తిరిగి ఓపెన్‌ చేయాలని శ్రీనివాస్‌ మాధవరెడ్దిన కోరుతూ వస్తున్నాడు. తనకు రావలసిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అతడి హత్యకు మాధవరెడ్డి పథకం రచించాడు. శ్రీనివాస్‌ను కారులో విజయవాడ తీసుకెళ్తూ నార్కెట్‌పల్లి వద్ద హత్య చేయించాడు. అనంతరం పాలేరు రిజర్వాయర్‌లో కారుతో పాటు తోసేసి ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు తేల్చారు.

ప్రముఖ రచయిత, సాహిత్యకారుడు, యూట్యూబర్ అయిన బొగ్గుల శ్రీనివాస్ ఈనెల 14 న ఖమ్మం జిల్లా(khammam) కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో శవంగా కనిపించాడు. ఆయన కారుతో పాటు రిజర్వాయర్‌లో పడి మృతి చెండాడు.  అయితే దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.. కాగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Also Read :  చల్లారని కామారెడ్డి చిచ్చు.. బీజేపీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Boggula Srinivas The Supari Murder

ఈ మేరకు ఖమ్మం రూరల్ ఏసీబీ కార్యాలయంలో ఈరోజు (ఆదివారం) నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను  ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్ కారుతో సహా పాలేరు రిజర్వాయర్‌లో పడిపోవడంతో మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించామన్నారు.  పోలీసుల సమగ్ర దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలిందని వివరించారు. బొగ్గుల శ్రీనివాస్ ది ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామమని. కానీ ఆయన 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. జీఎస్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణమని ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మొదట ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి మరణించినట్లు అనుమానించినప్పటికీ కుట్ర ఉందనే అనుమానంతో దర్యాప్తు చేశామన్నారు. మృతదేహంపై గాయాలు, కారులో రక్తపు మరకలు, సంఘటనా స్థలంలో లభించిన ఇతర ఆధారాలు కేసును ఛేదించేందుకు దోహదపడ్డాయని వివరించారు.  
 
బొగ్గుల శ్రీనివాస్‌కు ఇతరులతో వ్యాపార, ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా జీఎస్టీ లావాదేవీల్లో పెండింగ్‌లో ఉన్న డబ్బుల విషయమై కొందరు వ్యక్తులతో ఆయనకు గొడవలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే   నిందితులు హత్యకు పథకం రచించారని పోలీసులు వివరించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు ఉండగా  ఏ1గా మేకల వేణుమాధవరెడ్డి పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. బొగ్గుల శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా ఉన్న అతడు రూ.5 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురు వ్యక్తులతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు.

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం. బొగ్గుల శ్రీనివాస్‌ కు పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇస్తామని నమ్మించి ఆయనను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన నిందితులు ముందుగా  నిర్ణయించుకున్న  ప్రదేశంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. వారి మధ్య పెండింగ్‌లో ఉన్న డబ్బుల వ్యవహారం, వ్యాపార ఒత్తిడి, పరస్పర అనుమానాలు.. చివరకు హత్యకు దారి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ముందుగానే హత్యకు ప్రణాళిక రచించి, శ్రీనివాస్‌ను ఒంటరిగా కారులో తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు.

కాగా శ్రీనివాస్‌ను  ఈ నెల 14న తెల్లవారుజామున నార్కట్‌పల్లి సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారుతో పాటు పాలేరు రిజర్వాయర్‌లో పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కారును నీటిలోకి తోసేసి, అది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే, మృతదేహంపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను పరిశీలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపినప్పుడు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read :  కామారెడ్డిలో హైటెన్షన్..  ఈటల హౌస్ అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు