/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
suicide
ఇంటిచుట్టుపక్కల వారో,చుట్టాలో చనిపోతే చివరి చూపు కోసం తప్పుకుండా వెళ్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఆఖరి చూపు కోసం దేశాలు,ఖండాలు కూడా దాటి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి కడసారి చూపునకు భార్య,పిల్లలు కూడా రాలేకపోయారు. కారణం వారి పేదరికమే. అంత్యక్రియలు కూడా వీడియో కాల్ లోనే చూడాల్సి వచ్చిన విషాద ఘటన ఇది.
ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ సమస్యలతో...
వివరాలప్రకారం...నేపాల్‌కు చెందిన ప్రేమ్ రావల్ కూకట్ పల్లికి వచ్చి హౌస్ కీపింగ్ చేస్తున్నాడు. అతను భార్య యశోద, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసిఇ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.నెల క్రితం యశోద పిల్లలతో నేపాల్ కు వెళ్లగా ప్రేమ్ రావల్ స్నేహితునితో కలిసి ఉంటున్నాడు.
Aslo Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ సమస్యలతో శనివారం ప్రేమ్ ఆత్మహత్య చేసుకున్నాడు.దానికంటే ముందు పెద్దకూతురికి వీడియో కాల్‌చేసి తాను చనిపోతున్నట్లు చెపప్పడు. ఆర్థిక పరిస్థితులు సరిలేక కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మృతదేహన్ని తీసుకుని వెళ్లే పరిస్థితి లేదు. దీంతో రాజస్థాన్ లో ఉంటున్న ప్రేమ్ అన్నయ్య హైదరాబాద్ వచ్చి ఇక్కడే శ్మశానవాటికలో దహన సంస్కరాలు చేశాడు.
అతనితో పాటు నేపాల్ నుంచి వలస వచ్చిన మరో 80 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రేమ్ అంత్యక్రియలను వాట్సాప్ వీడియో కాల్ లో కుటుంబ సభ్యులకు చూపించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్తికలు తీసుకుని ఊరికి వెళ్లిన తరువాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని ప్రేమ్ సోదరుడు చెప్పాడు.
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన