TGPSC: అదనపు విధులతో ఉద్యోగాల భర్తీకి ఆలస్యం.. టీజీపీఎస్పీ కీలక నిర్ణయం

టీజీపీఎస్సీ ఎక్కువగా విధులు నిర్వహించడం వల్ల తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఆలస్యమవుతోందని కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని వేగవంతం చేయడం కోసం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
TGPSC

TGPSC

తెలంగాణలో గ్రూప్స్, తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు ముగిశాక.. ఫలితాలు రావడం, నియామకాలు జరగడం చాలా ఆలస్యమవుతోంది. అనవసరపు సమయాన్ని కేటాయించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TGPSC) చెబుతోంది. అలాగే తాము ఎక్కువ విధులు నిర్వహించాల్సి వస్తోందని కమిషన్ ఉద్యోగులు వాపోతున్నారు. పరీక్షలు జరిగిన వారంలోనే ఫలితాలు విడుదల చేయడం, నియామకల ప్రక్రియను వేగవంతం చేయడం కోసం తమకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, జనరల్ మెరిట్ లిస్టును సిద్ధం చేసే బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నారు. శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి పెట్టేందుకు  కమిషన్ త్వరలో ప్రభుత్వానికి లేఖ రాయనుంది.

Also Read: నేను అద్దాల మేడ కట్టుకోలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. '' పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఉద్యోగాలను భర్తీ చేయడం. కానీ మా బాధ్యత లేని విధులు నిర్వహించడం వల్ల చాలా సమయం వృధా అవుతోంది. పరీక్ష ముగిశాక.. ఒక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసమే మూడు నుంచి నాలుగు నెలలు వృధా అవుతోంది. జనరల్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మేము ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. దీనివల్ల ఫలితాలు విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం జరగదు. పరీక్ష జరిగాక వెంటనే ఫలితాలు విడుదల చేస్తే.. అభ్యర్థుల్లో కమిషన్‌పై నమ్మకం ఉంటుంది. అలాగే లిటిగేషన్‌లు కూడా తగ్గుతాయి. 

జనవరి 3, 4వ తేదీల్లో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఒక వారం లోపలే మేము పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల అభ్యర్థులకు కమషన్‌పై మరోసారి విశ్వాసం ఏర్పడుతుంది. వేగవంతం, కచ్చితత్వం, పారదర్శకతను మేము కోరుతున్నాం.  దేశంలో ఇతర పీఎస్సీల మాదిరిగానే మేము కూడా ఆర్థిక స్వతంత్రత కావాలని, నిర్మాణాత్మక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎక్కువగా మేము ఏమి ఆశించడం లేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే పీఎస్సీ, యూపీఎస్సీ మధ్య ఎలాంటి తేడా లేదు. ఇక్కడ కూడా అలాంటిదే అమలు చేయాలని కోరుతున్నాం.

Also Read: ఇండియాలోకి చైనా వైరస్..  కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన

 ప్రతీ ఏడాది మార్చి నాటికి అన్ని శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం మాకు లిస్ట్ ఇవ్వాలి. దీనివల్ల ఏప్రిల్‌ నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం, రిక్రూట్‌మంట్‌ విధానాన్ని చేపట్టే కార్యక్రమలు ప్రారంభిస్తాం. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు కూడా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. యూపీఎస్సీని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ విధానాన్ని మేము అధ్యయనం చేశాం. త్వరలోనే వివరణాత్మక ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేస్తాం. దీనివల్ల తెలంగాణలో కూడా ఉత్తమ ఉద్యోగ నిమాయక ప్రక్రియ అమలు చేయడం సాధ్యమవుతుందని'' బుర్రా వెంకటేశం తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment