BREAKING NEWS : తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే !

గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి.  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. 

New Update
group1 results

గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి.  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది.  పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.  

మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు

తెలంగాణ ఏర్పడిన తరువాత వెలువడిన మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం ఇదే కావడం విశేషం. దీంతో నిరుద్యోగులు ఈ ఫలితాల గురించి ఎంతో అతృతగా ఎదరుచూస్తున్నారు. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలు జరిగాయి.21 వేల 93  మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 

Also Read :  రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?

టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు మార్కులను ప్రకటించిన తరువాత ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలుంటే వారి  నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.  ఇక మంగళవారం అంటే రేపు గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ మేరకు ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే బ్యాక్‌లాగ్‌ ఉండవని కమిషన్‌ నిర్ణయించింది. 

TGPSC GROPU-1 Results - Direct Link

ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

Step-1: ముందుగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
Step-2: హోమ్‌ పేజ్‌లో కనిపించే గ్రూప్‌-1 ఫలితాల లింక్‌పై క్లిక్‌ చేయండి
Step-3: లాగ్‌ఇన్‌ వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
Step-4: వెంటనే స్క్రీన్‌పై టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ మార్కుల లిస్టు కనిపిస్తుంది.
Step-5: అనంతరం పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also Read :   Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. హాజరైన సీఎం రేవంత్‌

Also read :  చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

Advertisment
Advertisment