TG Weather Report: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. 40 కి.మీ వేగంతో దూసుకొచ్చేస్తోంది!

తెలంగాణలో రాబోయే 3రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ‘‘3రోజుల పాటు ఓ వైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉంది.’’ అని తెలిపింది.

New Update
telangana weather report next three days in telugu

telangana weather report next three days in telugu

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అకాల వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వెను వెంటనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షం కురిసిన వెంటనే ఎండలు మండిపోతున్నాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

అప్పుడే భగభగమండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అప్పటికప్పుడే వాతావరణం చల్లబడిపోయి వర్షం కురిసేస్తుంది. దీంతో ఎండలు ఎప్పుడు ఎక్కుతాయో.. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాబోయే మూడు రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

మూడు రోజులు జాగ్రత్త

ఈ  3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే మరోవైపు ఎండలు కూడా మండిపోనున్నట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షం కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అందులో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఈ విధంగా గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం వంటి జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

 

weather report today | TG Weather Updates | latest-telugu-news | IMD weather report | telangana weather report today | today-news-in-telugu | latest telangana news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists Surrenders : మావోయిస్టులకు షాక్‌...13 మంది లొంగుబాటు

వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders

Maoists Surrenders

Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Advertisment
Advertisment
Advertisment