/rtv/media/media_files/2025/02/07/sOQYBQUBprokcEtxVDeg.jpg)
rajanna siricilla Brucella atypical virus transmitted to child by dogs
తెలంగాణ (Telangana) లో మరో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ఒక వైరస్ తాజాగా బయటపడింది. ఈ వైరస్ బారిన పడిన ఒక చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసి పలువురు బీకేర్‌ఫుల్ అని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
తెలంగాణలో కొత్త వైరస్
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం కనగర్తికి చెందిన 4 ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేథ ఇటీవల తీవ్ర జ్వరం, శరీరంపై అలర్జీ బారిన పడింది. అయితే మొదటి చిన్నదే కదా అని పేరెంట్స్ అనుకున్నారు. కానీ అది రోజు రోజుకు తీవ్రతరం అవుతుండటంతో చిన్నారిని సిరిసిల్లలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
బ్రూసెల్లా ఇథిపికల్ వైరస్
అక్కడ వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దానికి సంబంధించి వ్యాధి నిర్ధారణ కాలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యుల చేసిన పరీక్షల్లో విషయం బయటపడింది. దాన్ని ‘బ్రూసెల్లా ఇథిపికల్’ (Brucella Atypical Virus) అనే వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ అనేది సామాన్యంగా కుక్కలకు మాత్రమే వస్తుందని వైద్యులు తేల్చారు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
కుక్కలకు ఎలా సోకుతుంది
దీంతో ఆ వైరస్ సోకిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే కుక్కలకు ఈ వైరస్ ఎలా సోకుతుందో కూడా వారు వివరించారు. కలుషితమైన నీటిని తాగడం, కలుషితమైన చికెన్ వ్యర్థాలు తినడం, పచ్చి మాంసం వ్యర్థాలు తినడం ద్వారా కుక్కలకు ఈ వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు. అందువల్ల ఆ కుక్కలు గ్రామాల్లో తిరిగినపుడు పిల్లలు వాటి మధ్య ఉంటే ఈ వైరస్ వారికీ సోకే ప్రమాదం ఉందని అన్నారు. చిన్నారి శ్రీమేథకు కూడా ఇలానే సోకి ఉంటుందని వారు తెలిపారు.