/rtv/media/media_files/2025/01/27/86GOeBCCyPZnUGf6GX83.jpg)
Cyber Crime
సోషల్ మీడియా యుగం వచ్చాక అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది ఆన్‌లైన్ స్కామ్స్‌కు బలై మోసపోతున్నారు. వేలు, లక్షలు, కోట్లు కూడా పోగొట్టుకున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా తాము చేసే స్కామ్‌లను కూడా అప్‌డేట్ చేసుకుంటూ కొత్త కొత్త ట్రిక్స్‌కు పాల్పడి జనాలకు వల వేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం మల్టీలెవర్ మార్కెటింగ్ మోసం వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు.
Also Read: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
మల్టీలెవల్ మార్కెంట్ మాయలో పడొద్దని ప్రజలకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. '' మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడకండి. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త. పేరు ఏదైనా మల్టీలెవల్ మార్కెటింగ్ అంటేనే పచ్చిమోసమని'' పోస్టు చేశారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడకండి. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త. పేరు ఏదైనా మల్టీలెవల్ మార్కెటింగ్ అంటేనే పచ్చిమోసం. #TelanganaPolice #MultiLevelMarketing #ChianMarkeing pic.twitter.com/bGEeRMABqB
— Telangana Police (@TelanganaCOPs) January 27, 2025
Also read: 'గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా, మోదీ, అమిత్ నరకానికే పోతారు': మల్లికార్జున ఖర్గే
అలాగే ప్రొడెక్ట్‌ల పేరిట చైన్ లింక్ మార్కెటింగ్ జరుగుతోందని.. ఇంట్లో సామాన్లు, మెడిసన్ కొంటే లాభాలంటూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గృహిణులు సదావకాశం అంటూ ఊదరగొట్టే యాడ్స్ ఇస్తారని, మీతో పాటు మరో నలుగురిని చేర్చుకోవాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తారని తెలిపారు. పేరు ఏదైనా అక్కడ జరిగేది పచ్చి మేసమని.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని.. మీతో పాటు ఇతరులను బలిచేయొద్దని కోరారు.
Also Read: మధ్యాహ్న భోజన పథకంపై.. విద్యా కమిషన్ కీలక నివేదిక