TG News: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్‌ లేదా మేలో ఉంటాయి.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy, komati reddy venkat reddy

TG News: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మార్చిలో విద్యార్థుల పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు జరిపించారలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

మరో మూడు నెలలకు వాయిదా! 

ఈ మేరకు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జనవరి 26 నుంచి అన్ని పథకాలు అమలు చేసి బరిలోకి దిగాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జోరందుకుంది. కానీ మరోవైపు దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ తిరిగి రాష్ట్రానికి వచ్చేలోపు కుల గణనకు సంబంధించి పూర్తి నివేదిక అధికారులు తయారు చేసి అందించనున్నారు. ఆ తర్వాత నివేదికను సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టులో సమర్పించనున్నారు. కోర్టు నివేదికను పూర్తిగా పరిశీలించి చట్టపరమైన చిక్కులున్నట్లు వెల్లడిస్తే వాటిని సవరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి రిజర్వేషన్ ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికలకు చట్టబద్ధత కల్పించనున్నారు. ఇదంతా జరగాలంటే కనీసం నెల రోజులకుపైగానే సమయం పట్టనుంది. ఈలోగా మార్చిలో విద్యార్థుల పరీక్షల తేదీలు రానున్నాయి. టీచర్లు బీజీ కానుండగా ఎలక్షన్స్ ఓటింగ్ కోసం స్కూల్స్ సెలవు ఉండాల్సిన పరిస్థితి. ఇదంతా పరిగణలోకి తీసుకుంటే ఏప్రిల్ లేదా మే నెలలోనే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

రిజర్వేషన్‌ అంశం కీలకం..

ఇక ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్‌ పెంపు అంశం కీలకంగా మారనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏయే కులాల జనాభా ఎంత ఉంది? వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులెలా ఉన్నాయనే పూర్తి వివరాలకోసం ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనను ముగించుకు రాగానే సర్వేపై మంత్రివర్గం సమీక్ష చేపట్టనుంది. సర్వే నివేదికను ఆమోదించిన తర్వాతే అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చలు జరిపే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: Rashmika: కొత్త అవతారమెత్తిన రష్మిక.. 'ఏసుబాయిగా' ఛావా ఫస్ట్ లుక్

కేంద్ర సహాయం కోరనున్న సర్కార్..

ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సివుంది. కాంగ్రెస్‌ హామీ ప్రకారం బీసీలకు 42 శాతం అమలు చేయాలంటే రిజర్వేషన్లు 50 శాతం దాటనుంది. సుప్రీంకోర్టు మాత్రం 50 శాతం మించకూడదని తెలిపింది. దీంతో బీసీలకు 42 శాతానికి పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తే ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 

ఇది కూడా చదవండి: TG News: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు