/rtv/media/media_files/2026/02/05/karimnagar-2026-02-05-11-50-54.jpg)
karimnagar
Animal Festival Sacrifice By Biting With Teeth
జగిత్యాల జిల్లా(jagityala) రాయికల్‌లో నిర్వహించిన భీమన్న జాతరలో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. భక్తి పేరుతో మూగజీవాల(animals) పట్ల క్రూరత్వంగా ప్రదర్శించడంతో జంతు ప్రేమికులు(Animal Lovers) మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలో రాయికల్ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన భీమన్న జాతరలో జంతు బలులు జరిగాయి. ఓ వ్యక్తి జంతువును పట్టుకుని.. అతని పంటితో కొరుకుతూ గావు పట్టారు. మూగజీవాన్ని ఇలా నోటితో కోరుకుతూ హింసించడంతో స్థానికులు భయాందళోనకు గురయ్యారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు.. ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!
మూగజీవాలపై ఇలాంటి చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని అంటున్నారు. భక్తి అనేది ఇంకో ప్రాణం తీసేలా ఉండకూడదని మండిపడుతున్నారు. జంతువులను ఇలా హింసించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow Us