Hydra Behavior: హైడ్రాకు మరో సారి హైకోర్టు చురకలు.. ‘మీ టార్గెట్ వాళ్లేనా..?’

తహసీల్దార్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ ఫాతిమా వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. హైడ్రా టార్గెట్‌ కేవలం పేద, మధ్య తరగతి కుటుంబాలేనా అని ప్రశ్నించింది. పక్షపాతంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం మండిపడింది.

New Update
high court on hydra

high court on hydra Photograph: (high court on hydra)

Hydra Behavior: తెలంగాణ హైకోర్టు(Telanagana High Court) మరోసారి మరోసారి హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని బుధవారం హై కోర్టు అసంత‌ృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అని నిలదీసింది. మియాపూర్‌, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని చెప్పుకొచ్చారు న్యాయమూర్తి. తహసీల్దార్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ  ఫాతిమా అనే మహిళ హైకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. గతంలో కూడా హైకోర్టు హైడ్రా పేదల ఇళ్లు మాత్రమే కూల్చడంపై అసహనం వ్యక్తం చేసింది.

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

ప్రస్తుతం ఫాతిమా వేసిన పిటిషన్‌లోనూ అదే తరహా వ్యాఖ్యలు చేసింది. నిరు పేదలు మాత్రమే కాకుండా.. పెద్దల అక్రమ కట్టడాలు కూడా కూల్చి చెప్పండని హైకోర్టు చెప్పింది. హైడ్రా ద్వారా అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే బాగుంటుందని ఉన్నత న్యాయస్థానం జస్టిస్ పేర్కొన్నారు. మీరాలం చెరువుపై ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశం హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశించింది.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

Also read: Manipur riots: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్‌, జోమి తెగల మధ్య గొడవలు

Also read: Mobile blast : ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు