Hydra: హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ జైలుకే.. హైకోర్టు జస్టిస్‌ సీరియస్‌!

ఖాజాగూడలో కూల్చివేతలపై హైకోర్టు జస్టిస్‌ లక్ష్మణ్‌ ఫైర్‌ అయ్యారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని, లేదంటే రంగనాథ్‌పై కఠిన చర్యలుంటాయన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధి తెలియకుండా కూలుస్తారా అని మండిపడ్డారు. రంగనాథ్‌ను ఎలా డీల్‌ చేయాలో తనకు బాగా తెలుసన్నారు.

New Update
Ranganath - Hydra

HYDRA chief AV Ranganath

Hydra: ఖాజాగూడ చెరువులో కూల్చివేతలు చేపట్టిన హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్‌ రంగనాథ్‌పై జస్టిస్‌ లక్ష్మణ్‌ సీరియస్‌ అయ్యారు. హైడ్రాపై న్యాయమూర్తి లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఆధారాలు ఉన్నాయా, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధులు తెలియకుండా ఎలా కూలుస్తున్నారని అడిగారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని జస్టిస్‌ లక్ష్మణ్ ఆదేశించారు. కమిషనర్‌ రంగనాథ్‌ను తాను ఎలా డీల్‌ చేయాలో అలాగే చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే రంగనాథ్‌పై సీరియస్‌ వ్యూ ఉంటుందన్నారు. 

ఇది మొదటిసారి కాదు..

ఖాజాగూడకు సంబంధించిన చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ణయించకుండా ఎలా చర్యలు తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మొదటిసారి కాదు.. గతంలోనూ సెప్టెంబర్‌ 30వ తేదీన కూడా హైడ్రా చాలా దూకుడుగా వెళుతున్న సందర్భంలో కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు వెంటనే ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధి నిర్ణయించకుండా.. వాటి పరిధిలో ఉన్నాయంటూ నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించింది. 

ఇది కూడా చదవండి: Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్!

ఆధారాలున్నాయా.. 

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల పరిధికి గల ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. పొలిటికల్‌ బాస్‌ల కోసం పనిచేస్తే బాగోదని హెచ్చరించింది. కష్టపడి ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చడం సరికాదని.. అది కూడా సెలవు రోజుల్లో కూల్చివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలాంటి వాళ్లను చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తే తెలుస్తుందంటూ కూడా సీరియస్‌ అయింది. ప్రస్తుతం కూడా హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్‌ అయింది. కూల్చివేతలపై హైకోర్టు పలుసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేయడంతో మున్ముందు స్పీడ్‌ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వాటిని కూల్చబోమని హైడ్రా తెలిపిన సంగతి తెలిసిందే. అక్రమమైనప్పటికీ వాటి జోలికి వెళ్లబోమని రంగనాథ్‌ తెలిపారు. నాలుగు నెలల క్రితం నుంచి ప్రారంభమైన వాటిపైనే తాము అడ్డుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్ కింద బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత వర్షాకాలంలో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ అందజేసినట్లు తెలిపారు.

New Update
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని 25,65,000 మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే గత వర్షా కాలం సీజన్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,700 కోట్ల రూపాయలు బోనస్‌గా కూడా చెల్లించామని తెలిపారు. ఇదే కాకుండా రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

క్వింటాకు బోనస్ ఇస్తామని..

రెండు పంటల సీజన్లలో మొత్తం 3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇందులో సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో కూడా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తున్న మొదటి ప్రభుత్వ కూడా దేశంలో ఇదేనని అన్నారు.

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పొంగులేటి వెల్లడించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన ప్రతీ క్వింటాకు మద్దతు ధరతో బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment