Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో 30 వేల లిస్ట్ రిలీజ్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో విడతలో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది.  

New Update
Indiramma House

Telangana Indiramma House

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో  విడతో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి వివరాలను సేకరిస్తోంది.  

మొత్తం 72 వేల మంది లబ్ధిదారులు..

ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయగా.. మొత్తం 72 వేల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశారు. కానీ మొదటి విడతలో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోనూ చాలా మంది అనర్హులు ఉన్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో 42 వేల మందికే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా.. ఇప్పుడు మిగిలిన 30 వేల మంది వివరాలను సేకరిస్తున్నారు. రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూసి ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

ఇక రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా లిస్ట్ తయారు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా తయారు చేస్తున్నారు.  తుది లిస్టును ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు సమాచారం. 

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

 telangana | cm revanth | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment