/rtv/media/media_files/2025/03/31/tL5NzKqhz6U32GY1BB4f.jpg)
Telangana Govt formed SIT on Betting Apps Promotions
బెట్టింప్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐజీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎస్ అధికారులు సింధుశర్మ, వెంకటలక్మి, చంద్రకాంత్,శంకర్ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి విచారణ చేయాలని డీజేపీ జితేంధర్ సిట్ సభ్యులను ఆదేశించారు. 90 రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు.
Also Read: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసినవాళ్లపై ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 25 మంది సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు విచారణకు కూడా హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు బలైపోయి తెలంగాణలో దాదాపు 1000 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సిట్ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సిట్ ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లయిన హర్ష సాయి, భయ్య సన్ని యాదవ్, పల్లవి ప్రశాంత్, రితూ చౌదరి, విష్ణు ప్రియ, సుప్రిత లాంటి వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ సజ్జనార్ సైతం బెట్టింగ్ యాప్స్ పట్ల యువతకు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను వాడొద్దంటూ యువతకు సూచనలు చేస్తున్నారు.
Also Read: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
telugu-news | rtv-news | Betting Apps