/rtv/media/media_files/2025/03/27/vOmVY96sv6kkZX2Byp99.jpg)
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా కొత్త కార్డులు మంజూరు అయిన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వెల్లడించారు. 2025 మార్చి 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.
Also Read : దేశవ్యాప్తంగా ఫోన్ పే..గూగుల్ పే బంద్..ఎందుకో తెలిస్తే షాక్..
త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ.
— Telangana Congress (@INCTelangana) March 26, 2025
ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి - నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి. pic.twitter.com/J9JYmm2dKU
Also Read : టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు
మనిషికి 6 కిలోల చొప్పున ఫ్రీ
తెలంగాణలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున ఫ్రీగా సన్నబియ్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే విప్లవాత్మక కార్యక్రమమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్న ఉత్తమ్.. ఇటీవల కొత్త దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు. ఇందులో కుటుంబ సభ్యులను యాడ్ చేస్తున్నామని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదు. రూ.8 వేల కోట్ల బియ్యం పంపిణీ జరిగితే, వాటిని లబ్ధిదారులు ఉపయోగించకపోవడంతో పక్కదారి పట్టాయి. అందుకే పేదలు కడుపునిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం” అని బుధవారం అసెంబ్లీలో మంత్రి తెలిపారు.
Also Read : భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి చేసిన భర్త!
Also Read : 2027 నాటికి 23 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయ్..!
telangana-congress | minister-uttam-kumar-reddy | ration-cards | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu