/rtv/media/media_files/2025/03/24/EpZFsYZ5OA34qEyAmT7M.jpg)
Telangana government to set up two more IIIT
TG Education: తెలంగాణలో కొత్తగా రెండు IIITలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో మరో 4 IIITలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యా సంస్కరణల మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రెండు ప్రాంగణాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని తొలుత అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఒకటి హనుమకొండ జిల్లాలో నెలకొల్పేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు.
మొత్తం 100 ఎకరాలు సేకరణ..
ఇప్పటికే బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వ విద్యాలయం(RGUKT)కు అనుబంధంగా కొత్త ప్రాంగణాలను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిపుణుల కమిటీ సభ్యులైన బాసర ఆర్‌జీయూకేటీ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య మంజూర్ హుస్సేన్.. రెవెన్యూ అధికారులతో కలిసి హనుమకొండ జిల్లాఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలోని 60 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇది అనుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాలకోసం మరో 40 ఎకరాలు అదనంగా కేటాయించాలని కమిటీ సూచనల మేరకు మొత్తం 100 ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు.
Also Read: Hamas: హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. కీలక నేతలు మృతి!
బాసర RGUKTలో ప్రతి సంవత్సరం 1500మంది ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో 6ఏళ్ల ఇంటిగ్రేటెడ్ B tech కోర్సులోని 9 వేల మందికి పైగా విద్యార్థులతో ఆ ప్రాంగణం నిండిపోతుంది. అదనంగా B tech బయోటెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్, ఫార్మా టెక్నాలజీ లాంటి ఇంజినీరింగ్, బయో సైన్స్ రెండింటితోకలిపి మల్టీ డిసిప్లెనరీ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండు ఆర్‌జీయూకేటీ ప్రాంగణాలను ప్రారంభించాలని మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం రూ.500 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్‌జీయూకేటీల అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ నిధులు ప్రాంగణానికే సరిపోకపోవడంతో కొత్త ప్రాంగణాలు 2025-26 విద్యా సంవత్సరంలో వచ్చే అవకాశం లేదు.
Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్
telugu-news | today telugu news